Apple store: ఇండియాలో ప్రారంభమైన మొదటి యాపిల్‌ స్టోర్‌.. హాజరైన సీఈఓ టిమ్‌ కుక్‌.

|

Apr 18, 2023 | 2:29 PM

భారత్‌లో మొట్టమొదటి యాపిల్‌ స్టోర్ ప్రారంభమైంది. ముంబైలో BKC యాపిల్ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్ ప్రారంభించారు. యాపిల్ స్టోర్ సందర్శించేందుకు యాపిల్ కస్టమర్లు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. . బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌ లో ఉన్న ఈ స్టోర్.. యాపిల్ రెండు అవుట్‌లెట్‌లలో మొదటిది...

Apple store: ఇండియాలో ప్రారంభమైన మొదటి యాపిల్‌ స్టోర్‌.. హాజరైన సీఈఓ టిమ్‌ కుక్‌.
Apple Store In Mumbai
Follow us on

భారత్‌లో మొట్టమొదటి యాపిల్‌ స్టోర్ ప్రారంభమైంది. ముంబైలో BKC యాపిల్ స్టోర్‌ను కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్ ప్రారంభించారు. యాపిల్ స్టోర్ సందర్శించేందుకు యాపిల్ కస్టమర్లు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. . బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌ లో ఉన్న ఈ స్టోర్.. యాపిల్ రెండు అవుట్‌లెట్‌లలో మొదటిది. త్వరలో ఢిల్లీలో కూడా మరో యాపిల్‌ స్టోర్‌ ప్రారంభించనున్నారు. ముంబైలో యాపిల్ స్టోర్ స్టోర్ ఓపెన్ చేయడానికి ముందే ఆపిల్ కస్టమర్లు వందల సంఖ్యలో స్టోర్ ముందు క్యూ కట్టారు. స్టోర్ తెరవడానికి కొన్ని గంటల ముందే క్యూలో నిలబడ్డారు. భారతీయ మార్కెట్‌లో ఆఫ్‌లైన్ ఉనికిని పెంచుకునేందుకు ఇతర పోటీదారు సౌత్ కొరియన్ దిగ్గజం శామ్‌సంగ్‌కు పోటీగా యాపిల్ ఈ స్టోర్‌ను ప్రారంభించింది.

ఇదిలా ఉంటే యాపిల్ బీకేసీ ప్రారంభోత్సవానికి దాదాపు 5వేల మంది టెకీలు హాజరయ్యారు. వీరిలో కొందరు ఉదయం 8 గంటలకే స్టోర్ వద్దకు చేరుకున్నారు. యాపిల్ సోమవారం స్టోర్ ప్రత్యేక ప్రివ్యూను కూడా నిర్వహించింది. అంతేకాదు.. కొంత మంది మీడియా నిపుణులకు కూడా స్టోర్‌లో ప్రత్యేకంగా అనుమతి ఇచ్చారు. ముంబై స్టోర్‌లో ఆపిల్ ప్రొడక్టుల్లో MacBooks, iPhoneలు, iPadలు, వాచ్‌లు భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాపిల్ అన్ని ప్రొడక్టులను ఇక్కడే విక్రయిస్తుంది. దీంతో పాటు, ఆపిల్ ఆర్కేడ్, ఆపిల్ HomePod, Apple Music, Apple TV+ని కూడా ప్రదర్శిస్తుంది. సందర్శకులకు అవసరమైన సాయం అందించేందుకు స్టోర్ మొదటి అంతస్తులో జీనియస్ బార్ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే 2016లో యాపిల్‌ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత భారత్‌లో అడుగు పెట్టారు. ప్రస్తుతం, భారతదేశ ఐఫోన్‌ల విక్రయాలు ఆల్ టైమ్ హైకి చేరాయి, మన దేశం నుంచి వార్షిక ఐఫోన్ ఎగుమతి బిలియన్ డాలర్లకు చేరుకుంది. బీజింగ్‌-వాషింగ్‌టన్‌ మధ్య సంబంధాలు చెడడంతో, చైనాను మించిన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆపిల్‌ కంపెనీ భారత్‌ వైపు చూస్తోంది.

 

మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..