‘టిక్ టాక్’ వచ్చేసింది.. యూజర్లు హ్యాపీ

| Edited By:

Apr 30, 2019 | 4:42 PM

ఇండియాలో సుమారు 3కోట్లమందికి వినోదాన్ని, కాలక్షేపాన్ని ఇస్తున్న టిక్ టాక్ యాప్ మళ్లీ ‘ప్రాణం పోసుకుంది’. కొన్ని రోజులుగా ఈ యాప్‌పై ఉన్న నిషేధం తొలగిపోవడంతో మళ్లీ యూజర్లంతా హ్యాపీ. గతంలోకి వెళ్తే.. ఈ యాప్ ద్వారా చాలామంది అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో దాన్ని యాప్ స్టోర్ల నుంచి తీసేయాలని ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ […]

‘టిక్ టాక్’ వచ్చేసింది.. యూజర్లు హ్యాపీ
Follow us on

ఇండియాలో సుమారు 3కోట్లమందికి వినోదాన్ని, కాలక్షేపాన్ని ఇస్తున్న టిక్ టాక్ యాప్ మళ్లీ ‘ప్రాణం పోసుకుంది’. కొన్ని రోజులుగా ఈ యాప్‌పై ఉన్న నిషేధం తొలగిపోవడంతో మళ్లీ యూజర్లంతా హ్యాపీ.

గతంలోకి వెళ్తే.. ఈ యాప్ ద్వారా చాలామంది అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో దాన్ని యాప్ స్టోర్ల నుంచి తీసేయాలని ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ప్లే స్టోర్ నుంచి టిక్ టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులో లేకుండా పోయింది. అయితే దీనిపై చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సంస్థ కూడా నిషేదాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. తరువాత కొన్ని షరతులతో ఈ యాప్‌పై ఉన్న నిషేధాన్ని ఇటీవల మద్రాసు హైకోర్టు ఎత్తేసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల తరువాత తాజాగా ఈ యాప్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. దీంతో టిక్‌టాక్ యూజర్లు తెగ సంబరపడుతున్నారు.