ప్రస్తుత రోజుల్లో పెరిగిన స్మార్ట్ ఫోన్ వినియోగం చాలా సమస్యలను దూరం చేసింది. ముఖ్యంగా గూగుల్ ఆధారంగా పని చేసే ఆండ్రాయిడ్ ఫోన్లల్లో వచ్చే యాప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లే వారికి గూగుల్ మ్యాప్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. గూగుల్ కూడా మ్యాప్స్ యాప్‌కు ఎప్పటికప్పడు సరికొత్త అప్‌డేట్స్‌ను ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. తాజాగా గూగుల్ మ్యాప్స్‌లో సమ్మర్ ట్రావెల్ లేదా హాలిడే సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్‌కి మూడు కొత్త ఫీచర్లను జోడించింది. ఇప్పటికే వినియోగదారులు మ్యాప్స్ సరికొత్త రూపాన్ని అందించే కొత్త డిజైన్ అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు. కొత్త డిజైన్ మ్యాప్‌లో స్థలాలను కనుగొనడంలో మీకు సహాయపడటానికి తక్కువ ట్యాబ్‌లతో పాటు కొత్త పిన్ రంగులతో క్లీనర్ హోమ్ పేజీని అందిస్తుంది. ముఖ్యంగా కొత్త ప్రాంతాల్లో ఆహారానికి సంబంధించిన హోటల్స్‌ను ఈ అప్‌డేట్‌లో ఈజీగా కనుగొనవచ్చు. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
తాజా అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ డైనింగ్, సందర్శన స్థలాల కోసం అనువైన ప్రదేశాలను గుర్తించే ప్రక్రియను సులభతరం చేస్తోంది. మీకు క్యూరేటెడ్ రెస్టారెంట్ సిఫార్సులను అందించడానికి యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని నిర్దిష్ట నగరాల్లోని నిపుణులు, నివాసితుల సహకారం తీసుకుంది. ముఖ్యంగా శోధన సమయంలో సిఫార్సులను పొందడానికి పైకి స్వైప్ చేస్తే ట్రెండీ స్పాట్‌ల వంటి ప్రసిద్ధ మూలాల నుండి జాబితాలను కనుగొంటారు. ట్రెండింగ్ లిస్ట్ హాటెస్ట్ కొత్త రెస్టారెంట్‌లను హైలైట్ చేస్తుంది. మ్యాప్స్‌లో వ్యక్తులు దేని గురించి మాట్లాడుతున్నారో బట్టి వారానికోసారి అప్‌డేట్ అవుతూ ఉంటుంది. టాప్ లిస్ట్ కమ్యూనిటీకు సంబంధించిన ఆల్-టైమ్ ఫేవరెట్ రెస్టారెంట్‌లను కవర్ చేస్తుంది. ముఖ్యంగా జనాల పెద్దగా తెలియని ప్రత్యేకమైన షాపులతో పాటు ప్రాంతాలు కూడా హైలేట్ అవుతాయి.
ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ మీకు ఇష్టమైన గమ్యస్థానాలను నిర్వహించడంతో భాగస్వామ్యం చేయడం సులభం చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? లేదా మీరు ఎక్కడికి వెళ్లారో ట్రాక్ చేయడానికి మీరు ఇప్పుడు జాబితాలను తయారు చేయవచ్చు. జాబితాను సృష్టించడం చాలా సులభంగా చేసింది. సేవ్ చేసిన ట్యాబ్‌లో “కొత్త జాబితా” ఎంచుకుని, తర్వాత మీరు మ్యాప్స్‌లో ఆసక్తికరమైన లొకేషన్‌ను గుర్తిస్తే మీరు దానిని మీ జాబితాకు జోడించవచ్చు. అదనంగా మీరు అద్భుతమైన రెస్టారెంట్‌లో చేసిన సమీక్ష వంటి మీ సోషల్ మీడియా పోస్ట్‌లకు లింక్‌లను కూడా చేర్చవచ్చు. ఇది మీ జాబితాలో స్థానం ఎందుకు పొందిందో? గుర్తుంచుకోవడానికి, అలాగే మీ సిఫార్సులను మరింత ఉపయోగకరంగా చేయడానికి మీకు సహాయం చేస్తుంది. ఏప్రిల్ నెలాఖరులో ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలకు ఈ నవీకరణ అందుబాటులో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మీరు వెళ్లే ముందు లొకేషన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవచ్చిన గూగుల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. గూగుల్‌కు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సమీక్షలు, ఫోటోగ్రాఫ్‌లను మూల్యాంకనం చేసి యూజర్లు ఏది బాగా ఇష్టపడతున్నారో? వాటినే చూపుతుంది. ముఖ్యంగా ఏఐ ఇప్పుడు ఫోటోగ్రాఫ్‌లలో వంటలను గుర్తించి, ఇది కొత్త మెనులను నావిగేట్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఆ రుచికరమైన ఆహారం పేరు, దాని ధర, దాని జనాదరణతో పాటు అది శాఖాహారమా? లేదా మాంసాహారమా? అని తెలుసుకోవడంలో మీకు సహాయపడుతుందని గూగుల్ చెబుతోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి