యాపిల్ ఐఫోన్.. చాలా మందికి ఒక డ్రీమ్ ఫోన్. ఎలాగైనా దానిని కలిగి ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే దాని ధర ఆకాశంలో ఉంటుంది. సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది. అయితే చాలా మంది విదేశాల నుంచి దానిని తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ తక్కువ ధరకే లభ్యమవుతుంది. మన దేశంతో పోల్చితే చాలా తక్కువ ధరకే ఐఫోన్ దొరకుతుంది. అందుకే చాలా మంది అక్కడి నుంచి తెప్పించుకుంటారు. ఇటీవల యాపిల్ ఐఫోన్ 15 ప్రోని విడుదల చేసింది. కాగా మీ బంధువులో, లేక స్నేహితులో అమెరికాలో ఉంటే అక్కడి నుంచి తెప్పించుకోవాలని మీరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడి సిమ్ లు అందులో పనిచేయవు. అదేంటి సిమ్ పనిచేయకపోవడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి అమెరికాలో ఫిజికల్ సిమ్ లు ఉండవు. ఐఫోన్ 15 ప్రో కూడా ఇదే సాంకేతికతను వినియోగించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 15 మోడల్ గ్లోబల్ వైడ్ గా అందుబాటులో ఉంది. మన దేశంలోని యాపిల్ స్టోర్లతో పాటు పలు ఆన్ లైన్ ప్లాట్ ఫారంలలో కూడా వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఫోన్ ర మన దేశంలో రూ. 1,34,900గా ఉంది. అంటే ఇది డాలర్లలో లెక్కిస్తే 1,628డాలర్లు అవుతుంది. అదే సమయంలో దీంతో పాటే విడుదలైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర మన దేశంలో రూ. 1,59,00గా ఉంది. డాలర్లలో లక్కిస్తే 1,930 డాలర్లు అవుతుంది. కానీ అమెరికాలో ఈ ఫోన్ల వాస్తవ ధరలు పరిశీలిస్తే చాలా తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. అమెరికాలో ఐఫోన్ 15 ప్రో ధర 999డాలర్లు, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ ధర 1,199డాలర్లకు దొరకుతోంది. దీంతో అక్కడి నుంచి ఎవరైనా బంధువులు లేదా స్నేహితులు వచ్చే వారుంటే అక్కడి నుంచి కొనుగోలు చేయించి తెచ్చుకుంటున్నారు. ఇలా విదేశాల నుంచి ఇక్కడకు తెచ్చుకునే విధానాన్ని గ్రే మార్కెట్ అని పిలుస్తున్నారు. ఇది మన దేశంలో అభివృద్ధి చెందుతోంది. విదేశాల్లో ఉంటున్న స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఇక్కడి వారు ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్, యూఏఈ వంటి దేశాలలో ఈ ఐఫోన్ మోడళ్లు చాలా తక్కువ ధరకు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
తక్కువ ధరకే లభిస్తుందని ఐఫోన్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు ఓ అంశాన్ని గుర్తించడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. అదేంటంటే అమెరికా ఐఫోన్లలో ఫిజికల్ సిమ్ స్లాట్ ఉండదు. అంతా ఈ-సిమ్ టెక్నాలజీనే ఉంటుంది. అమెరికాలో ఫిజికల్ సిమ్ స్లాట్ తో కూడిన ఫోన్లను తయారు చేయడం లేదు. ఒకవేళ మీకు ఫిజికల్ సిమ్ స్లాట్ కావాలంటే అమెరికా వైపు చూడకపోవడం బెటర్.
అమెరికా కాకుండా ఇతర దేశాల్లో కూడా తక్కువ ధరకే ఐఫోన్ 15 ప్రో లభ్యమవుతుంది. యూరప్, యూఏఈ దేశాల్లో అయితే ఫిజికల్ సిమ్ స్లాట్ కూడా ఉంటుంది. అలాగే హాంకాంగ్ లో అయితే డ్యూయల్ ఫిజికల్ సిమ్ స్లాట్ కూడా ఉంటుంది. ఒకటి ఫిజికల్ సిమ్ కాగా మరొకటి ఈ-సిమ్. ఈ ఫీచర్ మన దేశంలో లభ్యమవుతుున్న వేరియంట్లో కూడా లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..