ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ఇన్ స్టాగ్రామ్ కు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వినియోగదారులు ఉన్నాయి. వీరి సంఖ్య దాదాపు ఒక బిలియన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. మెటా యాజమాన్యంలోని ఇన్ స్టాగ్రామ్ కు తరచూ సరికొత్త ఫీచర్లు యాడ్ అవుతూ ఉంటాయి. వీటిలో చాలా ఫీచర్లను మనం వినియోగిస్తూ ఉంటాయి. అయితే మనకు తెలియని ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
ఇన్ స్టాగ్రామ్ అనేది ఆన్ లైన్ ఫొటో షేరింగ్ అప్లికేషన్ అని చెప్పవచ్చు. వినియోగదారులు తమ ఫోన్ లోని యాప్ ద్వారా ఫొటోలు, చిన్న వీడియోలను అప్ లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిని ఉపయోగించినప్పుడు మనకు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. ఫొటోలను పంపడం, స్నేహితులకు వేగంగా బదులు ఇవ్వడం తదితర వాటి కోసం చిట్కాలు ఉన్నాయి. ఇలాంటి ఐదు చిట్కాలను తెలుసుకుందాం.
ఇన్ స్టాగ్రామ్ లో మీకు నచ్చిన ఫొటోను మీ స్నేహితులకు పంపాలనుకున్నారు. అప్పుడు ముందుగా షేర్ మెనూ ఓపెన్ చేస్తారు. కానీ మరో పద్ధతిలో వేగంగా ఫొటోలను పంపించవచ్చు. ముందుగా పోస్ట్ కింద కనిపించే సెండ్ బటన్ ను ఎక్కువ సేపు నొక్కి ఉంచండి. వెంటనే మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన ఖాతాలను ప్రత్యక్షమవుతాయి. వాటిలో మీరు చిత్రాన్ని పంపాలనుకుంటున్న వారి ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. వెంటనే సెండ్ చేయండి.
గరిష్ట పరిమితికి మించి సైజు కలిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఆటోమెటిక్ గా క్రాప్ చేస్తుంది. కానీ అవి మీకు నచ్చినట్టు ఉండకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ క్రాప్ చేయకుండా ఫొటోను పోస్ట్ చేయడానికి ఇలా చేయండి. ముందుగా యాప్‌ను తెరవండి. దిగువ బార్‌లోని ప్లస్ అనే బటన్‌పై నొక్కండి. మీరు పంపాలనుకునే ఫొటోను ఎంపిక చేసుకోండి. ప్రివ్యూ ఎడమ వైపు ఉన్న ఎక్స్ పండ్ బటన్ పై నొక్కండి. ఒకవేళ దాన్ని గుర్తించడంలో ఇబ్బంది కలిగితే, అది ఎక్కడ ఉందో చూడటానికి ఎగువ స్క్రీన్‌షాట్‌ను తనిఖీ చేయాలి.
వ్యాపారస్తులకు తమ పోస్టులపై వచ్చే కామెంట్లపై తిరిగి బదులు ఇవ్వడం చాలా కష్టమైన పని. దీనికి కూడా ఒక సులభమైన మార్గం ఉంది. సుధీర్ఘమైన వ్యాఖ్యాలకు బదులుగా ఒకటి, రెండు పదాలతో ఎస్ఎంఎస్ తరహాలో క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా యాప్ సెట్టింగ్ కు వెళ్లండి. బిజినెస్ అనే ఆప్షన్ పై నొక్కండి. అనంతరం క్లిక్ రిప్లైస్ అనే దానిని క్లిక్ చేయండి. అనంతరం స్క్రీన్ దిగువన ఉన్న మూడు చుక్కల చాట్ బబుల్‌పై కూడా క్లిక్ చేసి, న్యూ క్లిక్ రిప్లై బటన్ ను ప్రెస్ చేయండి. అక్కడి కనిపించే మెసెజ్ ఫీల్డ్ లో మీరు అనుకున్న షార్ట్ కట్ పదాలను టైప్ చేయండి. ఆపై కుడివైపు ఎగువన ఉన్న సేవ్ బటన్‌ను నొక్క్కండి. ఇక మీ పని పూర్తయినట్టే. మీరు ఎవరికైనా మెసేజ్ రిప్లై పంపాలనుకుంటే మీరు ఉపయోగించిన షార్ట్‌కట్ పదాన్ని టైప్ చేయండి. వెంటనే దానికి లింకయిన మెసేజ్ కనిపిస్తుంది. వెంటనే దానిని సెండ్ చేయండి. దీని వల్ల మీ సమయం ఆదా కావడంతో పాటు కస్టమర్లకు వేగంగా రిప్లయ్ ఇవ్వవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ ను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తాయి. వాటిలో చాలా వరకూ మనకు నచ్చినప్పటికీ, కొన్నిమాత్రం ఇబ్బంది కలిగించేలా ఉంటాయి. ఇలాంటివి మనకు కనిపించకుండా చూసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ లో దీనికి వీలు ఉంది. ఆ పోస్టు లేదా కథనానికి కుడి వైపు దిగువన ఉన్న మూడు చుక్కలు (త్రీడాట్స్)పై నొక్కండి. అక్కడి కనిపించిన హైడ్ యాడ్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. ఇక మీకు అలాంటి ఇబ్బంది పెట్టే, ఇష్టం లేని ప్రకటన కనిపించదు.
గూగుల్ లో మాదిరిగానే ఇన్ స్టాగ్రామ్ లో కూాడా మీరు సెర్చ్ చేసిన హిస్టరీ అంతా స్టోర్ అవుతుంది. దానిని వెంటనే తొలగించేందుకు కూడా అవకాశం ఉంది. ముందుగా మీ ఫోన్ లో ఇన్‌స్టాగ్రామ్ ను తెరవండి. దిగువ బార్ లోని మీ ప్రొఫైల్ చిత్రాన్ని ప్రెస్ చేయండి. అనంతరం యాప్ సెట్టింగ్‌లకు వెళ్లండి. అక్కడ యువర్ యాక్టివిటీ ఆప్షన్ ను నొక్కండి. వెంటనే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కిందకు స్క్రోల్ చేసి రీసెంట్ సెర్చెస్ ను ఎంచుకోవాలి. ఎగువన కుడివైపు ఉన్న క్లియర్ ఆల్ బటన్ ను నొక్కండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..