‘రియల్ మీ’ నుంచి తక్కువ ధరతో హై స్పీడ్ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే లాంచ్.. అద్బుత ఫీచర్లు..

రియల్ మీ వరుస పెట్టి ఫోన్లు రిలీజ్ చేస్తోంది. హై రేంజ్ ఫోన్స్‌తో మధ్య తరగతి ప్రజల కోసం తక్కువ ధరలతో కూడిన ఫోన్లను కూడా ఇండియలో లాంచ్ చేస్తోంది. తాజాగా మరో మధ్య స్థాయి ఫోన్ విడుదలకు సిద్దమైంది. ఆ ఫోన్ వివరాలు..

రియల్ మీ నుంచి తక్కువ ధరతో హై స్పీడ్ స్మార్ట్‌ఫోన్.. త్వరలోనే లాంచ్.. అద్బుత ఫీచర్లు..
Realme 4x5g

Updated on: Nov 23, 2025 | 3:19 PM

Realme P4X 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ నుంచి త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్దమైంది. పీ4 సిరీస్‌లో భాగంగా రియల్ మీ P4X 5జీ స్మా్ర్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఫోన్ స్లో కాకుండా ఒకేసారి 90 యాప్‌లను వాడేలా హైస్పీడ్, గేమింగ్ ఫర్‌ఫామెన్స్‌ ఇందులో ఉంటుంది. పీ4 సిరీస్‌లో భాగంగా ఆగస్టులో ఒక ఫోన్‌ను రియల్ మీ తెచ్చింది. దానికి మరిన్ని ఫీచర్లు జోడిస్తూ ఈ కొత్త ఫోన్ తెస్తుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను డిస్‌ప్లేకు ఉంచింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని తెలుస్తుంది. వేగవంతమైన ఫోన్‌గా ఇది నిర్మించబడింది అంటూ ఫ్లిప్‌కార్ట్‌లో ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో తక్కువ ధరకే గేమింగ్, ఫాస్ట్ ఫర్‌ఫామెన్స్ కావాలనుకునేవారికి ఈ ఫోన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇది 90fps గేమింగ్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు అధిక ఫ్రేమ్ రేట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా మంచి క్లీన్, మోడరన్ లుక్ కలిగి ఉంది.

ఫీచర్లు ఇవే..

-45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్

-బైపాస్ ఛార్జింగ్

MediaTek Dimensity 7400 చిప్‌సెట్‌

Android 15

8GB RAM

7000 ఎంఏహెచ్ బ్యాటరీ

-144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల పూర్తి HD+ LCD డిస్‌ప్లే

-మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్

-50MP ప్రధాన కెమెరా

-వెనుక 2MP సెకండరీ కెమెరా

-సెల్ఫీల కోసం 8MP కెమెరా

ఫోన్ ధర

దీని ధర రూ.20 వేల లోపే ఉంటుందని సమాచారం. రెండు వేరియెంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి తెచ్చే అవకాశముంది. ఏయే రంగుల్లో లాంచ్ చేస్తారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.  ఎంతసేపు గేమ్స్ వాడినా ఫోన్ హీటెక్కకుండా ఈ ఫోన్ తయారుచేశారు. ఫోన్‌లో గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ మంచిగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. త్వరలోనే ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు అధికారికంగా బయటపడే అవకాశముంది. 5జీ సపోర్ట్‌తో అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి