
ఏఐ.. ఇప్పుడు ప్రతీచోట వినిపిస్తున్న పేరు. సామాన్య ఉద్యోగి కూడా ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాడు. ఏఐ వల్ల తమ ఉద్యోగం ఊడిపోతుందేమోనని భయపడుతున్నాడు. అంతలా ఏఐ ఇప్పుడు జాబ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. ఏఐ వల్ల జాబ్ పోతుందేమోనని ఉద్యోగులు భయపడుతుంటే.. కంపెనీలకు మాత్రం ఇది ఇప్పుడు ఒక వరంగా మారింది. వేగంగా పనులు అవ్వడంతో పాటు ఉద్యోగుల కోసం పెట్టే బడ్జెట్ కూడా తగ్గుతోంది. ఇక మొబైల్, టెలికాం కంపెనీలు ఏఐను యూజ్ చేసుకుంటూ కస్టమర్లను పెంచుకునే పనిలో పడ్డాయి.
ఏఐ సబ్‌స్క్రిప్షన్లను టెలికాం కంపెనీలు ఉచితంగా అందిస్తున్నాయి. గూగుల్‌తో కలిసి జియో రూ.35 వేల విలువైన జెమినీ 3 ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా ఇస్తుండగా. .ఎయిర్‌టెల్ రూ.17 వేలు విలువ చేసే పర్‌పెక్సిటీని ఏడాది పాటు ఫ్రీగా ఇస్తోంది. జియో 18 నెలల పాటు ఉచితంగా ఇస్తుండగా.. ఎయిర్ టెల్ ఏడాది పాటు అందిస్తోంది. ఇక వీటికి పోటీగా ఛాట్‌జీపీటీ ఇండియాలో ఏడాది పాటు ఛాట్‌జీపీటీ గోను యూజర్లందరూ ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది.
ఏఐ కంపెనీలు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్లు ఇవ్వడం వెనుక మార్కెట్ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. ఇండియాలో ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువ. దీంతో తొలుత వినియోగదారులను ఉచితంగా ఇచ్చి అలవాటు చేయడం ద్వారా తర్వాత సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారనేది ఏఐ కంపెనీల వ్యూహంగా తెలుస్తోంది. ఇండియలో విభిన్నమైన అలవాట్లు, వివిధ భాషలు ఉండటం వల్ల మోడల్ శిక్షణకు ఏఐ కంపెనీలకు విలువైన సమాచారం అందిస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి