టెక్నాలజీ అద్భుతం.. మరణించిన కూతురితో ఆ తల్లి..

| Edited By: Pardhasaradhi Peri

Feb 13, 2020 | 5:20 PM

టెక్నాలజీ అద్భుతం ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నాలుగేళ్ల క్రితం ఓ వ్యాధితో మరణించిన తన ఏడేళ్ల కూతురిని ఓ తల్లి స్పృశించగలిగింది. వాల్డ్ ఆఫ్ వర్చ్యువల్ రియాల్టీ(వీ ఆర్) లో ఇదో మెస్మరైజింగ్ యాస్పెక్ట్ అంటే అతిశయోక్తి లేదు. దక్షిణ కొరియాలో ఓ టీవీ డాక్యుమెంటరీని రూపొందించిన  నిర్వాహకులు  అసాధారణ టెక్నాలజీని ఉపయోగించారు. లక్షలాది మంది కొరియన్లు ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. వీఆర్ హెడ్ సెట్ ధరించిన జాంగ్ జీ అనే ఆ తల్లి […]

టెక్నాలజీ అద్భుతం.. మరణించిన కూతురితో ఆ తల్లి..
Follow us on

టెక్నాలజీ అద్భుతం ఓ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నాలుగేళ్ల క్రితం ఓ వ్యాధితో మరణించిన తన ఏడేళ్ల కూతురిని ఓ తల్లి స్పృశించగలిగింది. వాల్డ్ ఆఫ్ వర్చ్యువల్ రియాల్టీ(వీ ఆర్) లో ఇదో మెస్మరైజింగ్ యాస్పెక్ట్ అంటే అతిశయోక్తి లేదు. దక్షిణ కొరియాలో ఓ టీవీ డాక్యుమెంటరీని రూపొందించిన  నిర్వాహకులు  అసాధారణ టెక్నాలజీని ఉపయోగించారు. లక్షలాది మంది కొరియన్లు ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. వీఆర్ హెడ్ సెట్ ధరించిన జాంగ్ జీ అనే ఆ తల్లి తన కూతురిని తాకగలగడమే కాక.. ఆ చిన్నారి బర్త్ డే రోజున తాను మిస్సయిన బర్త్ డే కేక్ పైని గల క్యాండిల్స్ ని కూడా వెలిగించగలిగింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది?  నయెన్ అనే ఆ చిన్నారి తాలూకు ఫోటోలను, వీడియోల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ నిర్వాహకులు 3 డీ ఇమేజీని రీక్రియేట్ చేయగలిగారట.

ఇందుకు వీరికి ఎనిమిది నెలల సమయం పట్టింది. ‘మీటింగ్ యు’పేరిట వారు ఈ షో నిర్మించారు. జాంగ్ జీ సంతోషానికి అవధుల్లేవు. మరణించిన తన కూతురిని నిజంగానే తాను సజీవంగా చూసినట్టు, తాకినట్టు అనుభూతి చెందింది ఆమె. టచ్ సెన్సిటివ్ గ్లోవ్స్, ఆడియోలను కూడా ఈ సందర్భంగా ఈ డాక్యుమెంటరీ నిర్మాతలు ఉపయోగించారు. అయితే సౌత్ కొరియాలో అప్పుడే  ఈ షో మీద కొందరు విమర్శలు లేవనెత్తారు. మరణించిన వారిని వారి తలిదండ్రులో, బంధువులో మళ్ళీ చూసినట్టు అనుభూతి చెందినా, వారిని తాకినట్టు ఫీలయినా వారి జ్ఞాపకాలు, స్మృతులు తిరిగి  మానసికంగా వారిని వేధిస్తాయని విమర్శకులు పెదవి విరుస్తున్నారు. ఏమైనా.. ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది.