
కొంత కాలంగా మన ఫోన్లకు పనికొచ్చే కాల్స్ కంటే పనికిరాని, చిరాకుపెట్టించే కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. లోన్ కావాలా అంటూ, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా అంటూ ఒకటే కాల్స్ వస్తున్నాయి. ఇదే క్రమంలో కొన్ని సైబర్ నేరగాళ్ల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మీ పేరు, చిరునామాను ఉపయోగించి వివిధ సాకులతో మీ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా OTPని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. గతంలో టెలిమార్కెటింగ్ కాల్స్ అన్ని సమయాలలో వచ్చేవి. ఇప్పుడు ఆ కాల్స్ కొంచెం తగ్గాయి. అయితే మోసగాళ్ళు ఇప్పుడు వేరే విధంగా ఉచ్చులు వేస్తున్నారు. మీ మొబైల్‌కు సందేశాలు వస్తున్నాయి. మీరు వాటిపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే.
చాలా సార్లు మీ మొబైల్‌లో మీ విద్యుత్ బిల్లు అకస్మాత్తుగా 10,000 లేదా 20,000 వచ్చినట్లు మెసేజ్ వస్తుంది. లేదా బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఈ లావాదేవీని బ్లాక్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయమని ఇందే ఉంటుంది. దానిపై క్లిక్ చేశారో మీరు సైబర్ నేరగాళ్లకు చిక్కినట్టే. అయితే ఏ సందేశాలు నిజమైనవో, ఏవి మోసపూరితమో వాటిని చూడటం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. 2025 మే 6 నుండి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని వాణిజ్య సందేశాలకు కేరెట్లను జోడించడాన్ని తప్పనిసరి చేసింది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి