Malware Alert: అయ్యబాబోయ్ 100పైగా యాప్స్‌లో భయంకర వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే..!

|

Jun 02, 2023 | 6:15 PM

ప్రతి అవసరానికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారడంతో మోసగాళ్లు కూడా భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు. తాజా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు. స్పిన్ ఓకే అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు.

Malware Alert: అయ్యబాబోయ్ 100పైగా యాప్స్‌లో భయంకర వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే..!
Malware
Follow us on

పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రస్తుతం మాల్వేర్ దాడులు కొత్త కాదు. హ్యాకర్‌లు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారి డేటా, డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను ప్రయత్నించడం వల్ల వెబ్‌లో కొత్త మాల్వేర్ సర్క్యులేట్ అవుతున్నట్లు మేము తరచుగా నివేదికలను వెల్లడిస్తూ ఉంటాయి. అయితే సర్వ సాధారణమైనా ఈ మాల్వేర్ దాడులను ప్రస్తుతం యూజర్లను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. అయితే అరచేతిలోనే ప్రపంపచం అనే కాన్సెప్ట్‌తో ఈ స్మార్ట్ ఫోన్లను అందరూ ఇష్టపడుతన్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ లభించే వివిధ యాప్స్ ద్వారా అన్ని సేవలను పొందుతున్నారు. ప్రతి అవసరానికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారడంతో మోసగాళ్లు కూడా భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు. తాజా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు. స్పిన్ ఓకే అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ఉన్నాయి. ఈ మాల్ వేర్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఈ ట్రోజన్ మాల్వేర్ వినియోగదారులను ఆకర్షించడానికి రోజువారీ రివార్డ్‌లతో కూడిన మినీగేమ్‌లను అందించడం ద్వారా చట్టబద్ధమైనదిగా కనిపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే, డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ మాల్వేర్ వినియోగదారుల పరికరాలలో నిల్వ చేసి ఉన్న ప్రైవేట్ డేటాను దొంగిలించి రిమోట్ సర్వర్‌కు పంపుతుంది. ఉపరితలంపై స్పిన్ ఓకే మాడ్యూల్ మినీ-గేమ్‌లు, టాస్క్‌ల సిస్టమ్, బహుమతులు, రివార్డ్ డ్రాయింగ్‌ల సహాయంతో యాప్‌లపై వినియోగదారుల ఆసక్తిని కొనసాగించడానికి రూపొందించారని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన యాప్‌లు వివిధ స్థాయిలలో హానికరమైన కంటెంట్‌ను కలిగి ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ యాప్‌లు 421,290,300 పైగా డౌన్ లోడ్స్ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. పరిశోధకులు దీని గురించి గూగుల్‌ను హెచ్చరించినప్పటికీ, వినియోగదారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా దూరంగా ఉండాలని కోరారు.

ట్రోజన్ మాల్వేర్ ద్వారా ప్రభావితమైన యాప్‌లు ఇవే

ట్రోజన్ ఎస్‌డీకే సోకి మొత్తం 101 యాప్‌ల పేర్లను కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఈ యాప్స్‌లో అత్యధిక డౌన్‌లోడ్స్ ఉన్న టాప్ యాప్‌ల గురించి తెలుసుకుందాం. 

ఇవి కూడా చదవండి
  • నాయిజ్: సంగీతంతో వీడియో ఎడిటర్ (కనీసం 100,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • జాప్యా:  ఫైల్ బదిలీ, భాగస్వామ్యం (కనీసం 100,000,000 ఇన్‌స్టాలేషన్‌లు.. ట్రోజన్ మాడ్యూల్ వెర్షన్ 6.3.3 నుంచివెర్షన్ 6.4లో ఉంది. ప్రస్తుత వెర్షన్ 6.4.1లో లేదు
  • వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ (కనీసం 50,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ (కనీసం 50,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ (కనీసం 50,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • క్రేజీ డ్రాప్ (కనీసం 10,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • క్యాష్‌జైన్ – డబ్బు రివార్డ్‌ను సంపాదించండి (కనీసం 10,000,000 ఇన్‌స్టాలేషన్‌లు)
  • ఫిజ్జో నవల – ఆఫ్‌లైన్‌లో చదవడం (కనీసం 10,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • క్యాష్ ఈఎం: రివార్డ్‌లను పొందండి (కనీసం 5,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).
  • టిక్: సంపాదించడానికి చూడండి (కనీసం 5,000,000 ఇన్‌స్టాలేషన్‌లు).

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..