Video: టెస్ట్‌ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌..! ఎగసిపడ్డ మంటలు..

దక్షిణ టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌లో స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ పరీక్ష సమయంలో భారీ విస్ఫోటనం సంభవించింది. పదవ టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమవుతున్న షిప్ 36 ప్రోటోటైప్ పూర్తిగా నాశనమైంది. రాకెట్ ఇంజన్ల స్టాటిక్ ఫైర్ టెస్ట్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయోగం నిరవధికంగా వాయిదా పడింది.

Video: టెస్ట్‌ సమయంలోనే పేలిపోయిన స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌..! ఎగసిపడ్డ మంటలు..
Spacex Rocket Exploded

Updated on: Jun 20, 2025 | 12:58 PM

టెక్సాస్‌లో పరీక్షల సమయంలో స్పేస్‌ఎక్స్ రాకెట్ పేలిపోయింది. పేలుడు సమయంలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. చాలా ఎత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే.. ఓ పెద్ద బాంబు పేలినట్లు అనిపిస్తోంది. ఈ ప్రమాదంలో స్టార్‌షిప్ ప్రోటోటైప్‌ నాశనం అయింది. దీంతో రాకెట్ వ్యవస్థ పదవ టెస్ట్ ఫ్లైట్‌కు సన్నాహాలు ఆగిపోయాయి. షిప్ 36 కీలకమైన స్టాటిక్ ఫైర్ టెస్ట్‌కు సిద్ధం అవుతున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఈ పరీక్షలో రాకెట్ ఇంజన్లు కొద్దిసేపు మండుతాయి, ప్రయోగానికి ముందు కీలక వ్యవస్థలను తనిఖీ చేస్తారు. కానీ, ఈ టెస్ట్‌ సమయంలోనే భారీ పేలుడు సంభవించి, రాకెట్‌ పూర్తిగా పేలిపోయింది.

రాకెట్ పదవ టెస్ట్‌ ఫ్లైట్‌ సన్నాహక సమయంలో దక్షిణ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ లాంచ్ సైట్‌లో టెస్ట్ స్టాండ్‌లో ఉన్నప్పుడు, రాత్రి 11 గంటల ప్రాంతంలో స్టార్‌షిప్ ప్రధాన క్రమరాహిత్యం ఎదుర్కొన్నట్లు స్పేస్‌ఎక్స్ నివేదించింది. ఈ పేలుడు కారణంగా శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రయోగ సన్నాహాలలో నిరవధిక విరామం ఏర్పడింది. స్పేస్‌ఎక్స్ జూన్ 29న ఈ రాకెట్‌ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్ పదవ పరీక్షగా గుర్తించబడుతుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి