
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగలనుంది. 2026లో స్మార్ట్‌ఫోన్ ధలు భారీగా పెరగనున్నాయి. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఏఐ డేటా సెంటర్ డిమాండ్లు, చిప్‌ల కొరత, పెరుగుతున్న ఖర్చుల ప్రభావం స్మార్ట్‌ఫోన్లపై పడనుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ ధరలు వచ్చే ఏడాది 7 శాతం పెరగుతాయని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత ఏర్పడుతుంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చు కూడా పెరుగుతోంది. దీని వల్ల 2026లో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాదితో పోలిస్తే 2026లో స్మార్ట్‌ఫోన్ ధరలు 6.9 శాతం పెరగనున్నాయని చెబుతున్నారు. ఇది మునపటి సంవత్సరాలతో పోలిస్తే అత్యధికమని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ఫిష్‌మెంట్‌లు 2.1 శాతం తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొరత కారణంగా డిమాండ్ ఏర్పడటంతో మెమెరీ చిప్‌ల ధరలు 2026 మధ్య నాటికి 40 శాతం పెరిగే అవకాశముంది. స్మార్ట్‌ఫోన్ల తయారీకి మెమెరీ చిప్‌లు అవసరం. దీని వల్ల స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా భారీగా పెరగనున్నాయి.
స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు తయారీ ఖర్చులు పెరిగిపోయాయి. ఈ సంవత్సరం 200 డాలర్ల కంటే తక్కువ ధర బడ్జెట్ ఫోన్ల మెటీరియల్ బిల్లు 20 నుంచి 30 శాతం పెరిగింది. ఇక మిండ్ రేంజ్, ప్రీమియం పరికరాల ధర 10 నుంచి 15 శాతం పెరిగింది. 2026 మొదటి అర్ధ భాగంలో మరో 8 నుంచి 15 శాతం పెరిగే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.