Anticipated Smartphones: రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. రిలీజ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

|

Jun 25, 2024 | 6:45 PM

2024లో ప్రముఖ కంపెనీలైన యాపిల్, గూగుల్, సామ్‌సంగ్ వంటి ముఖ్య స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్లు ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు త్వరలోనే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉంటే కచ్చితంగా వెయిట్ చేసి సరికొత్త మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు.

Anticipated Smartphones: రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల జాతర.. రిలీజ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!
Smart Phones
Follow us on

ప్రతి ఏడాది జూన్ తర్వాత స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికులు ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే ఈ ఆరు నెలల్లోనే టాప్ కంపెనీలన్నీ తమ సూపర్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తాయి. వారి అంచనాలను నిజం చేసేలా 2024లో ప్రముఖ కంపెనీలైన యాపిల్, గూగుల్, సామ్‌సంగ్ వంటి ముఖ్య స్మార్ట్ ఫోన్ తయారీ బ్రాండ్లు ఫ్లాగ్‌షిప్ మోడల్‌లను ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు త్వరలోనే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తితో ఉంటే కచ్చితంగా వెయిట్ చేసి సరికొత్త మోడల్ ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఆరు నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న టాప్ ఫోన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఐఫోన్ 16

ఐఫోన్ 16 ఫోన్లు సెప్టెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. యాపిల్ వార్షిక ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌‌లో ఈ సంవత్సరం 6.1 అంగుళాలతో వచ్చే ఐఫోన్ 16 రిలీజ్ చేయనున్నారు. ఈ ఫోన్ నాలుగు మోడల్స్‌లో అందుబాటులో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 6.7 అంగుళాల స్క్రీన్‌తో ఐ ఫోన్ 16 ప్లస్, 6.3 అంగుళాల ఐ ఫోన్ 16 ప్రో, 6.9 అంగుళాల ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ నాలు మోడల్‌లు ఐఓఎస్ 18 సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్‌లు ముఖ్యమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో వస్తాయని భావిస్తున్నారు. ప్రో వేరియంట్‌లు యాపిల్ ఇంటెలిజెన్స్‌‌తో వస్తాయని, అలాగే ఆన్-డివైస్, ప్రైవేట్-క్లౌడ్ బ్యాక్డ్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీతో వస్తాయని అంచనా.

గూగుల్ పిక్సెల్ 9

ప్రముఖ కంపెనీ గూగుల్ రాబోయే రోజుల్లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఫోన్లను టెన్సార్ జీ 4 ప్రాసెసర్‌తో అందించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా గూగుల్ ఐఓ 2024లో ఈ ఫోన్లను లాంచ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల ఫీచర్లపై అనేక లీక్‌లు బయటకు వస్తున్నాయి. మెరుగైన పనితీరు, మెరుగైన కెమెరాలు, రిఫ్రెష్ చేసిన డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్లపై స్మార్ట్ ఫోన్ల ప్రియులు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ 6

సామ్‌సంగ్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫోల్డబుల్‌లను జూలైలో ఆవిష్కరించే అవకాశం ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, జెడ్ ఫోల్డ్ 6 వచ్చే ఈ ఫోన్లు ఫ్లిప్, ఫోల్డబుల్ డిజైన్‌లతో వస్తాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో పని చేస్తాయి. అలాతే గెలాక్సీ ఏఐ సామర్థ్యాల శ్రేణిని ఏకీకృతం చేస్తూ వన్ యూఐ 6.1తో లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన కంప్యూటింగ్ శక్తిని అందిస్తాయి.

మోటోరోలా రాజర్, రాజర్ ప్లస్ 

మోటోరోలా కంపెనీ ఇప్పటికే 2024 ప్రథమార్ధంలో అద్భుతమైన బడ్జెట్, మిడ్-టైర్, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. తాజాగా రాబోయే రోజుల్లో కంపెనీ తన ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్స్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. రాజర్, రాజర్ ప్లస్ పేరుతో లాంచ్ చేసే ఈ ఫోన్లు సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీనివ్వనున్నాయి. రాజర్ ప్లస్ అతిపెద్ద కవర్ డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 7 7 సిరీస్ చిప్ ద్వారా శక్తిని పొందుతాయి. అలాగే రాజర్ 2024 ఎడిషన్ మరింత బడ్జెట్ స్నేహపూర్వక ఫోల్డబుల్‌గా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..