Simple One Electric Scooter: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 236 కిలోమీటర్లు.!

|

Aug 17, 2021 | 1:52 PM

Simple One Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులకు తీవ్ర భారంగా మారిపోతోంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోలు వందకుపైగా చేరడంతో వాహనాలను..

Simple One Electric Scooter: ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 236 కిలోమీటర్లు.!
Simple One Electric Scooter
Follow us on

Simple One Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో వాహనదారులకు తీవ్ర భారంగా మారిపోతోంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోలు వందకుపైగా చేరడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల పలు వాహన సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. దీంతో వాహనదారులు కూడా చమురు ధరల కారణంగా చాలా మంది కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓలాతో పాటు వివిధ సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా విద్యుత్‌ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్‌ ఎనర్జీ తన తొలి స్కూటర్‌ సింపుల్‌ వన్‌ను ఆవిష్కరించింది. 4.8 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-ఐయాన్‌ బ్యాటరీని ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే గరిష్ఠంగా 236 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వెల్లడించింది. ఈ స్కూటర్‌ ధర రూ.1,09,999 (ఎక్స్‌షోరూం)గా సంస్థ పేర్కొంది.

దీని గరిష్ఠ వేగం గంటకు 105 కిలోమీటర్లు కాగా, 2.95 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ వివరించింది. అలాగే బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం, జియో-ఫెన్సింగ్, ఎప్పటికప్పుడు అప్‌డేట్లు, నావిగేషన్‌ వ్యవస్థ, టైర్లలో గాలి ఒత్తిడి ఎంతుందో తెలిపే సదుపాయాలు ఈ స్కూటర్‌లో ఉన్నాయని వెల్లడించింది.

13 రాష్ట్రాల్లో అందుబాటులో..

కాగా, ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 13 రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించారు. ఫేమ్‌2 నిబంధనల కింద రూ.60 వేల వరకు రాయితీ పొందే అవకాశం ఉన్నందున ఈ స్కూటర్‌ను రూ.1,947తో బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. తమిళనాడులోని హోసూరులో 2లక్షల చదరపు అడుగుల్లో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, తొలి దశలో ఏడాదికి 10లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని ఆయన తెలిపారు.

కాగా, ఇటీవల ఓలా కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సైతం విడుదల చేసింది. ఇలా ఒక్కో కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు వెళ్తుండటంతో, వాహనదారులు కూడా అలాంటి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తీసుకోవడమే బెటర్‌ అన్నట్లు చూస్తున్నారు. ఇలాంటి వాహనాలపై కూడా ఈఐఎం, రుణం కూడా అందిస్తున్నాయి పలు సంస్థలు.

ఇవీ కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ పండగ ఆఫర్లు.. రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు.. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తుకు అదనపు రాయితీలు

Gas Cylinder Price: సామాన్యుడికి గుది బండగా మారిన గ్యాస్‌ సిలిండర్‌.. గత మూడు నెలల్లో ఎంత మోత మోగిందంటే..

Petrol-Diesel Price Today: దేశంలో తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.!