
సంక్రాంతి పండగకు నగరాల్లో ఉండే జనం సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ఆంధ్రాకు జనం తరలివెళ్తారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలో సంక్రాంతి మరింత బాగా జరుపుకుంటారు. ఆంధ్రా వాసులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోడి పందెలు, పిండి వంటలు, ముగ్గులు, చుట్టాలు, కొత్త అల్లుళ్లతో ఇళ్లన్ని కళకళలాడుతూ ఉంటాయి.
అంతటి ప్రముఖ్యత ఉన్న పండగ కనుక దాదాపు ప్రతి ఒక్కరు వారి స్వగ్రామాలకు వెళ్తారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరం దాదాపు సగం ఖాళీ అయిపోతుంది. అయితే పండక్కి ఇంటి వెళ్లడం ఎంత సంతోషకరమైన విషయమో.. ప్రయాణం అంత దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్ దొరకడం చాలా కష్టం. చాలా మంది నెలల ముందుగానే తమ టిక్కెట్లు రిజర్వ్ చేసుకొని ఉంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పండగ రద్దీ తీవ్ర ఉంటుందని గ్రహించిన సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది.
పండగ కోసం ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన ఎస్‌సీఆర్.. తాజాగా మరో మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
రైలు నెం. 08511/08512 విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. రైలు నెం.07416 అనకాపల్లి – వికారాబాద్ స్పెషల్ రైళ్లు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. టిక్కెట్ బుకింగ్ డిసెంబర్ 31 (బుధవారం) ఉదయం 8 గంటలకు ఓపెన్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి