Samsung: ఈ ల్యాప్‌టాప్‌ ధర అక్షరాల రూ. 3 లక్షలు.. అంతలా ఏముందనేగా..

|

Jul 01, 2024 | 7:12 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. గ్యాలక్సీ బుక్‌ 4 అల్ట్రా పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. సామ్‌సంగ్ గతేడాది తీసుకొచ్చిన గ్యాలక్సీ బుక్‌ 4 సిరీస్‌లో టాప్‌ మోడల్‌గా ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేశారు...

Samsung: ఈ ల్యాప్‌టాప్‌ ధర అక్షరాల రూ. 3 లక్షలు.. అంతలా ఏముందనేగా..
Samsung
Follow us on

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. గ్యాలక్సీ బుక్‌ 4 అల్ట్రా పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. సామ్‌సంగ్ గతేడాది తీసుకొచ్చిన గ్యాలక్సీ బుక్‌ 4 సిరీస్‌లో టాప్‌ మోడల్‌గా ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేశారు.

ఫీచర్ల విషయానికొస్తే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ బుక్‌ 4 అల్ట్రాలో 16 ఇంచెస్‌తో కూడిన 2,880 x 1,800 పిక్సెల్‌లు రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. టచ్‌ అమో ఎల్‌ఈడీతో ఈ డిస్‌ప్లేను అందించారు. 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా9 సీపీయూ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 32 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు.

ఈ ల్యాప్‌టాప్లో డాల్బీ ఆట్మోస్‌ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు, డ్యూయల్‌ మైక్రోఫోన్‌ను అందించారు. అలాగే ఇందులో థండర్‌బోల్ట్‌ 4, యూఎస్‌బీ టైప్‌ ఏ పోర్ట్‌ను అందించారు. ఫుల్‌ హెచ్‌డీ వెబ్‌క్యామ్‌, బ్యాక్‌లిట్ న్యూమరిక్‌ కీబోర్డ్‌ను అందించారు. దీంతోపాటు హెచ్‌డీఎమ్‌ఐ 2.1 పోర్ట్‌, ఎస్‌డీ కార్డు స్లాట్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 140 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 76 వాట్స్‌హవర్‌ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ బుక్‌ 4 అల్ట్రా 16 జీబీ ర్యామ్‌, ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 7 సీపీయూ వేరియంట్‌ ధర రూ. 2,33,990 కాగా, ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 9 సీపీయూతో పాటు 32జీబీ ర్యామ్‌ ధర రూ. 2,81,990గా నిర్ణయించారు. ఇక లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 12,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..