
కొత్త టెక్నాలజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్ ప్రియులకు ఒక బిగ్ షాక్. శామ్‌సంగ్ ట్రిపుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్, కఠినమైన మన్నిక పరీక్షల శ్రేణిలో విఫలమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో ఫోన్ స్క్రీన్, ఛాసిస్ ఒత్తిడిలో విరిగిపోతున్నట్లు చూడొచ్చు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇటీవల ఈ ప్రీమియం ఫోల్డబుల్‌ను – ఇప్పటివరకు అత్యంత ఖరీదైనది – చైనా, దక్షిణ కొరియా, యుఎఇ, యుఎస్ఎ, యూరప్‌తో సహా ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది.
ఈ ఫుటేజ్ జాక్ నెల్సన్ హోస్ట్ చేసిన ప్రముఖ YouTube ఛానెల్ JerryRigEverything నుండి తీసుకోబడింది. వీడియోలో, స్ట్రక్చరల్ “బెండ్ టెస్ట్”కి గురైనప్పుడు ఫోన్ డిస్ప్లే , ఫ్రేమ్ పగిలిపోయింది. నెల్సన్ ఫోన్‌ను కొద్దిగా వెనుకకు వంచడంతో స్క్రీన్ బ్రేక్ అయింది. పైగా డిస్ప్లే వెనుక ఉన్న ప్లాస్టిక్ నిర్మాణం సన్నగా, పెళుసుగా కనిపించిందని, ఇది మొత్తం వైఫల్యానికి దోహదపడిందని నెల్సన్ గుర్తించారు. ఫైర్ టెస్ట్ సమయంలో కూడా ఫోన్ ఇబ్బంది పడింది. దాని OLED పిక్సెల్‌లు కేవలం 17 సెకన్ల పాటు మంటకు గురైన తర్వాత శాశ్వతంగా దెబ్బతిన్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఫోన్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి