Samsung Galaxy Z Series: విడుదలకు ముందే లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 డిజైన్లు; ఆగస్టులో విపణిలోకి!

|

Jun 25, 2021 | 9:43 PM

ఆగస్టులో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్‌ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 రెండు ఫోన్లు విడుదల కానున్నాయి.

Samsung Galaxy Z Series: విడుదలకు ముందే లీకైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 డిజైన్లు; ఆగస్టులో విపణిలోకి!
Samsung Galaxy Z Fold 3 And Galaxy Z Flip 3
Follow us on

Samsung Galaxy Z Series: శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో మరో రెండు నూతన ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. వాటిలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 అనే రెండు మోడల్స్ విడుదల కానున్నాయి. ఆగస్టులో జరిగే గెలాక్సీ అన్ ప్యాక్‌డ్‌ ఈవెంట్‌లో ఈ రెండు ఫోన్లు లాంచ్ చేసేందుకు శాంసంగ్ ప్లాన్ చేసింది. అయితే, విడుదలకు ముందే ఇవి నెట్టింట్లో లీకయ్యాయి. ఓ ప్రముఖ టిప్‌స్టర్ ఈమేరకు ట్విట్టర్లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్ల ఫొటోలను విడుదల చేశాడు. దీంతోపాటు కొన్ని ఫీచర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 3 లో అండర్ డిస్‌ప్లే సెల్పీ కెమెరా ఉండనుందని ఇదివరకు విడుదలైన లీకులు ప్రకటించాయి. అయితే తాజాగా విడుదలైన డిజైన్లలో హోల్ పంచ్ డిజైన్‌తో ఈ కెమెరాలు రానున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ (vevleaks) జూన్ 24 న శాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయని పేర్కొన్నాడు. ఈ మేరకు రెండు ఫోన్లకు సంబంధించిన డిజైన్లను ట్వీట్ చేశాడు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ ప్రత్యేక ఎస్ పెన్‌కు సపోర్ట్ చేస్తుందని రాసుకొచ్చాడు. అలాగే ఈఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని పేర్కొన్నాడు. ప్రస్తుతానికైతే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. మడతపెట్టినప్పుడు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 కన్నా.. శాంసంగ్ నూతన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 చాలా సన్నగా ఉందని ఫొటోలో చూపించారు. మరోవైపు, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్‌ఫోన్‌లో సెకండరీ స్క్రీన్ పక్కన డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తుండగా, గ్లాస్ బాడీ ప్యానెల్స్ చుట్టూ మెటల్ ఫ్రేమ్ అందిచనున్నట్లు లీకులు చెబుతున్నాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5 జీలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో రోజుకు 50,000 నుంచి 70,000 యూనిట్లను ఉత్పత్తి చేసే పనిలో శాంసంగ్ ఉందని తెలుస్తోంది. ఆగస్టులో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్‌ కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాని ముందే ఏడు మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారిని తెలుస్తోంది. అయితే, ధరలు మాత్రం వెల్లడించలేదు.

Also Read:

JioPhone Next Features:  రిలయన్స్ అందిస్తున్న తక్కువ ధరలో స్మార్ట్  ఫోన్..జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్లు ఇలా ఉండొచ్చు!

Instagram: డెస్క్‌టాప్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు.. ఎలా చేయాలో తెలుసా?

Komaki Electric Scooter : ఈ కంపెనీ స్కూటర్‌పై రూ.20,000 తగ్గింపు..! అవకాశం కొన్నిరోజులు మాత్రమే..

Windows 11: ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన విండోస్‌ 11; అందుబాటులోకి ఎప్పుడంటే..?