శాంసంగ్​ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్‌26 ఎఫ్​ఈ గురించి లీకైన విషయాలు తెలుసా

Samsung Galaxy S26.. శాంసంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గెలాక్సీ ఎస్26 ఫ్యాన్ ఎడిషన్ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అధికారికంగా విడుదల కాకముందే ఈ మొబైల్‌కు సంబంధించిన దాదాపు ఇరవై ఆరు ప్రోమో ఇమేజెస్ బయటకు వచ్చాయి. దీంతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగులు, కీలక ఫీచర్లపై ఒక స్పష్టత వచ్చేసింది.

శాంసంగ్​ మొబైల్ లవర్స్‌కి షాక్! గెలాక్సీ ఎస్‌26 ఎఫ్​ఈ గురించి లీకైన విషయాలు తెలుసా
Samsung Galaxy S26 Fan Edition

Updated on: Aug 21, 2026 | 7:20 AM

ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి రాబోతున్న సరికొత్త హ్యాండ్‌సెట్ మార్కెట్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ దీనిని రూపొందించింది. సెప్టెంబర్ ఆరంభంలో మార్కెట్‌లోకి రానున్న ఈ డివైజ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ఆకర్షణీయమైన డిజైన్

లీకైన వివరాల ప్రకారం ఈ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ చాలా ప్రీమియం, క్లాసీ లుక్‌తో కనిపిస్తోంది. ఫ్లాట్ ఫ్రేమ్, సన్నని బెజెల్స్‌తో కూడిన డిస్‌ప్లే, స్క్రీన్ పైన చిన్న పంచ్ హోల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ చాలా నీట్‌గా అమర్చారు. అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది గ్రాఫైట్, పిస్తాచియో, బ్లూబెర్రీ అనే మూడు అట్రాక్టివ్ కలర్స్‌లో లభించనుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,900 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ప్రాసెసింగ్ విషయానికి వస్తే దీనిలో శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2500 చిప్‌సెట్ వాడినట్లు సమాచారం.

స్మార్ట్ ఏఐ ఫీచర్లు

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్ ఉంది. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 8MP టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. సెల్ఫీల కోసం 12MP కెమెరా ఉంది. ఇందులో 8K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇది వస్తోంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ కూడా అందించారు. శాంసంగ్ ప్రీమియం ఫోన్లలో ఉండే సర్కిల్ టు సెర్చ్, ఆడియో ఎరేజర్, హారిజాన్ లాక్, మై ఫ్యాన్‌క్యామ్ వంటి అనేక అధునాతన ఏఐ ఫీచర్లను ఈ ఎఫ్ఈ మోడల్‌లో కూడా అందిస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us