వినూత్న ఫోన్ ను ఆవిష్కరించిన శామ్ సంగ్ కంపెనీ

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ అయిన కంపెనీలు అక్కడే నిలిచిపోలేదు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో మోబైల్స్ ను ఆవిష్కరిస్తూ.. మార్కెట్ లో నిలదొక్కుకుంటున్నారు. మోబైల్ మార్కెట్ లో ఎవ్వరికీ సాధ్యం కాదు అనుకున్న మోబైల్ మోడల్ ను శామ్ సంగ్ కంపెనీ ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. వినియోగదారులను ఆకట్టుకుని.. తమ కంపెనీ పేరు నిలబెట్టుకునేందుకు శామ్ సంగ్ తన వినియోగ దారులనే కాకుండా ఇతరులను కూడా ఆకట్టుకునేలా ఫోల్డింగ్ […]

వినూత్న ఫోన్ ను ఆవిష్కరించిన శామ్ సంగ్ కంపెనీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:19 PM

ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ అయిన కంపెనీలు అక్కడే నిలిచిపోలేదు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో మోబైల్స్ ను ఆవిష్కరిస్తూ.. మార్కెట్ లో నిలదొక్కుకుంటున్నారు. మోబైల్ మార్కెట్ లో ఎవ్వరికీ సాధ్యం కాదు అనుకున్న మోబైల్ మోడల్ ను శామ్ సంగ్ కంపెనీ ఆవిష్కరించి చరిత్ర సృష్టించింది. వినియోగదారులను ఆకట్టుకుని.. తమ కంపెనీ పేరు నిలబెట్టుకునేందుకు శామ్ సంగ్ తన వినియోగ దారులనే కాకుండా ఇతరులను కూడా ఆకట్టుకునేలా ఫోల్డింగ్ మోబైల్ ను లాంచ్ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో సామ్ సంగ్ ఈ ఫోన్ ని విడుదల చేసింది.

గెలాక్సీ ఫోల్డ్‌ ఫీచర్లు

గెలాక్సీ ఫోల్డ్‌ గా పిలుస్తున్న ఈ ఫోన్‌ లో అదర గొట్టే ఫీచర్లతో తయారు చేశారు. ఈ ఫోన్ ను మడతబెడితే 4.6 అంగుళాల స్మార్ట్‌ఫోన్‌గా వాడుకోవచ్చు. ఫోన్‌ను తెరిస్తే 7.3 అంగుళాల ట్యాబ్లెట్‌గా కనిపిస్తుంది. ఫోన్‌ను ట్యాబ్‌గా వాడేప్పుడు ఒకేసారి మూడు యాప్‌లను తెరుచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4,380ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో మొత్తం ఆరు కెమేరాలు ఉన్నాయి. వెనక వైపు 16మెగా పిక్సెల్ తో ఒక కెమేరా, 12మెగా పిక్సెల్ తో రెండు కెమేరాలు ఉంటాయి. ముందు వైపు మూడు కెమేరాలు ఉండగా.. ఫోన్ మడత పెట్టినప్పుడు రెండు లోపలికి వెళతాయి. 10మెగాపిక్సెల్ తో సెల్ఫీ కెమేరా ఉంది. ఇక దీని ధర ఆపిల్ ఫోన్లకంటే ఎక్కువగా ఉంది. దీని ప్రారంభ ధర 1980 డాలర్లుగా నిర్ణయించారు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1లక్ష నలభై వేల రూపాయలుగా ఉంటుంది. అయితే ఈ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 26 నుంచి అమెరికాలో ప్రారంభంకానున్నాయి.

తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌

శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌తో పాటు మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సైతం కంపెనీ ప్రకటించింది. కొత్త గెలాక్సీ ఎస్‌10 శ్రేణిలో ఎస్‌10, ఎస్‌10 5జీ, ఎస్‌10ఈ, ఎస్‌10 ప్లస్‌ మోడళ్లను ప్రదర్శించింది. ఎస్‌10 5జీ వెర్షన్‌ ధర, విడుదల తేదీలను కంపెనీ ప్రకటించలేదు. ఎస్‌10ఈ ప్రారంభ ధర 749 డాలర్లుగా, ఎస్‌10 ప్లస్‌ 999 డాలర్లుగా నిర్ణయించింది. వీటి విక్రయాలు మార్చి 8 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే వారం జరగనున్న ప్రపంచ మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రత్యర్థి సంస్థలు 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కాగా.. ఈ ఫోన్లు భారత మార్కెట్లోకి ఎప్పుడొస్తాయన్నదానిపై కూడా శామ్‌సంగ్‌ ఇంకా స్పష్టతనివ్వలేదు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు