Samsung Mobiles: శాంసంగ్ కొత్త ఫోన్ ప్రీఆర్డర్ సేల్ ప్రారంభం.. F54 సిరీస్ లుక్, ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Jun 07, 2023 | 5:48 PM

Samsung Smartphone: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని కలిగిన శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను‌ విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా Samsung Galaxy F54 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎన్నో అద్భుత ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ రూ.30 కంటే తక్కువ ధరకే...

Samsung Mobiles: శాంసంగ్ కొత్త ఫోన్ ప్రీఆర్డర్ సేల్ ప్రారంభం.. F54 సిరీస్ లుక్, ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Samsung Galaxy F54
Follow us on

Samsung Smartphone: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని కలిగిన శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను‌ విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా Samsung Galaxy F54 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎన్నో అద్భుత ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ రూ.30 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో పెద్ద బ్యాటరీ, కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ సప్పోర్ట్ వంచి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో Samsung Galaxy F54 స్మార్ట్‌ఫోన్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం..

Samsung Galaxy F54 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్..

భారత్ మార్కెట్‌లోకి మంగళవారమే ప్రవేశించిన ఈ ఫోన్ 8 జీడీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నెల్ మెమోరీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అలాగే ఈ ఫోన్ మంగళవారం మధ్యహ్నం 3 గంటల నుంచి ప్రీఆర్డర్‌లకు అందుబాటులో ఉండగా.. సేల్ ప్రారంభం త్వరలోనే ప్రారంభం అయే అవకాశం ఉంది.

Samsung Galaxy F54 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

కొత్త శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌, 6.7-అంగుళాల స్క్రీన్‌, ఫుల్ HD+ రిజల్యూషన్‌ AMOLED ప్యానెల్‌, స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, హోమ్-బ్రూడ్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ 5G ఫోన్ Android 13 OSతో పని చస్తుంది. అలాగే శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్‌కి 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక 108MP ప్రైమరీ సెన్సార్‌, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీ, వీడియో  కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 32MP సెన్సార్ ఉంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడాలంటే.. 6,000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సప్పోర్ట్ చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..