Samsung Galaxy A14: శాంసంగ్‌ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

|

May 21, 2023 | 7:23 PM

ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో తన A-సిరీస్ హ్యాండ్‌సెట్ శ్రేణిని విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. SamInsider నివేదిక ప్రకారం.. ఇది వచ్చే వారం దేశంలో Samsung Galaxy A14 4Gని త్వరలో..

Samsung Galaxy A14: శాంసంగ్‌ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..
Samsung Galaxy A14
Follow us on

ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో తన A-సిరీస్ హ్యాండ్‌సెట్ శ్రేణిని విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. SamInsider నివేదిక ప్రకారం.. ఇది వచ్చే వారం దేశంలో Samsung Galaxy A14 4Gని త్వరలో ప్రారంభించవచ్చు. రాబోయే ఫోన్ Samsung Galaxy A14 5G, A34 5G, A54 5G వంటి వాటితో చేరనుంది.

ఈ హ్యాండ్‌సెట్ రెండు స్టోరేజ్ మోడల్‌లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 64GB, 128GB+ 4GB RAM ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి వేరియంట్‌ ధర రూ. 13,999గా, రెండో వేరియంట్‌ ధర రూ.14,999 ఉండే అవకాశాలున్నాయని సమాచారం.

కాగా, Samsung Galaxy A14 4G ఈ సంవత్సరం ప్రారంభంలో మలేషియాలో ప్రారంభించబడింది. హ్యాండ్‌సెట్ 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల HD+ LCD స్క్రీన్, పైభాగంలో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌ని కలిగి ఉంది. ఇది MediaTek Helio G80 చిప్‌సెట్‌తో వస్తుంది. కెమెరా విషయానికొస్తే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 5MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌తో జత చేయబడిన 50MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

Samsung Galaxy A14 4G Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా One UI 5 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5,000mAh బ్యాటరీ ఉంది. ఇక 10వాట్ ఛార్జింగ్ అడాప్టర్‌ను అందిస్తుంది. హ్యాండ్‌సెట్ బ్లాక్, సిల్వర్, డార్క్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. Galaxy A14 4G మూడు మోడల్‌లు భారతదేశంలో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి