హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ టెక్నాలజీ సొల్యూషన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం(ఫిబ్రవరి 6) ఆవిష్కరించింది. ఈ సాంకేతికతపై పనిచేసే ట్రక్కును ‘ఇండియా ఎనర్జీ వీక్’ కార్యక్రమంలో ప్రదర్శించింది. రెండు పెద్ద హైడ్రోజన్ సిలిండర్‌లతో పనిచేసే ఈ ట్రక్ తయారీ కోసం రిలయన్స్ కంపెనీ ప్రముఖ ట్రక్‌మేకర్ కంపెనీ అశోక్ లేలాండ్‌తో కలిసి పనిచేసింది. హెచ్2ఐసీఈతో నడిచే ఈ ట్రక్కు దాదాపుగా జీరో ఎమిషన్‌ను విడుదల చేస్తాయి. అలాగే సంప్రదాయ డీజిల్ ఇంజిన్‌తో నడిచే ట్రక్కుల తరహాలోనే.. హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులు పనిచేసే సామర్థ్యం ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. శబ్దకాలుష్యం ఉండకపోగా.. నిర్వహణ వ్యయాలు కూడా దీని ద్వారా తగ్గుతాయని పేర్కొంది.
కాగా, జీరో ఏమిషన్ సాధించడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం.. ఇటీవలి యూనియన్ బడ్జెట్ 2023లో ఇంధన పరివర్తన కోసం రూ.35,000 కోట్లు కేటాయించింది. ఇందులోని రూ.19,700 కోట్లను గ్రీన్ హైడ్రోజన్‌కు కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో కేటాయించింది భారత్. ఇదే క్రమంలో ఈ ఏడాది చివరినాటికి హైడ్రోజన్ రైలును ప్రవేశపెడతామని కూడా కేంద్ర రైల్వే మంత్రి నిర్మలా సీతారామన్ వాగ్ధానం చేశారు. భారత్ అన్ని రంగాలలోనూ గ్రీన్ మొబిలిటీని కోరుకుంటున్న ఈ నేపథ్యంలోనే.. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండియా లిమిటెడ్ వినూత్న ఆడుగులు వేసి.. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రక్కును విడుదల చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి