
ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ కోరుకునే వారికి Redmi కొత్త ఫోన్లు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా Pro Maxలో ఏకంగా 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ అందించారు. రూ.33,999 ప్రారంభ ధరతో వచ్చే Pro మోడల్‌లోనూ 9,000mAh బ్యాటరీ ఉండటం విశేషం. మరి వీటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
3,500 nits డిస్‌ప్లే.. కెమెరాలో AI ఫీచర్లు
ఈ రెండు మోడళ్లలో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,200Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 3,500 nits ప్రకాశాన్ని అందిస్తుంది. 12-bit కలర్ టెక్నాలజీతో 68.7 బిలియన్ రంగులను చూపగలదు. Corning Gorilla Glass Victus 2 రక్షణ ఉంది. Stereo Speakers, Dolby Atmos కూడా లభిస్తాయి. వెనుక 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP Super-Wide-Angle కెమెరా ఉంది. Pro Maxలో 32MP సెల్ఫీ కెమెరా ఇవ్వగా, Proలో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫొటోల్లో వెలుగు ప్రతిబింబాలను తగ్గించడం, అవసరం లేని వస్తువులను తొలగించడం వంటి AI సదుపాయాలు ఉన్నాయి.
Proలో Snapdragon 6s Gen 4 చిప్‌సెట్, 8GB వరకు RAM, 9,000mAh Silicon-Carbon బ్యాటరీ ఉన్నాయి. 67W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Pro Maxలో Snapdragon 6 Gen 5 చిప్‌సెట్, 12GB వరకు RAM, 10,000mAh బ్యాటరీ ఉన్నాయి. 100W ఛార్జింగ్‌తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
Pro Max బ్యాటరీ 1,600కు పైగా ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా 80% సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని Xiaomi తెలిపింది. రెండు ఫోన్లలో Android 16 ఆధారిత HyperOS 3 ఉంది. 4 సంవత్సరాల OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి. IP66, IP68, IP69K రక్షణ కూడా ఉంది. ధర విషయానికి వస్తే Pro 8GB+128GB ధర రూ.33,999, 8GB+256GB ధర రూ.36,999. Pro Max 8GB+256GB ధర రూ.44,999, 12GB+256GB ధర రూ.50,999. రూ.5,000 వరకు బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. Pro విక్రయాలు సెప్టెంబర్ 17న, Pro Max అమ్మకాలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి.