Realme Narzo N63: రూ. 9వేలకే కొత్త ఫోన్‌.. 50ఎంపీ ఏఐ కెమెరా.. ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు..

|

Jun 06, 2024 | 3:19 PM

రియల్‌మీ నార్జో ఎన్‌63 లెదర్ బ్లూ, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. లెదర్ బ్లూ వేరియంట్ వేగన్ లెదర్ ఫినిషింగ్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్ రూ. 8,499కి అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది.

Realme Narzo N63: రూ. 9వేలకే కొత్త ఫోన్‌.. 50ఎంపీ ఏఐ కెమెరా.. ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు..
Realme Narzo N63
Follow us on

మన దేశంలో బడ్జెట్‌ లెవెల్‌ ఫోన్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ ఉండే ఫోన్లను అందరూ ఇష్టపడతారు. ఈ క్రమంలో రియల్‌మీ ఓ కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మీ నార్జో ఎన్‌63 పేరిట తీసుకొచ్చింది గతేడాది రియల్‌ మీ నార్జో ఎన్‌53 నవంబర్‌లో వచ్చిన ఫోన్‌ అత్యంత విజయవంతమైంది. కస్టమర్‌ రివ్యూలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. దీంతో సెల్స్‌ కూడా బాగా రాబడుతున్నాయి. దీనికి కొనసాగింపుగా, అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ఈ కొత్త నార్జో ఎన్‌63ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో ఆక్టా-కోర్ చిప్‌సెట్, 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఏఐ-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా వంటివి ఉన్నాయి. రియల్‌ మీ నార్జో ఎన్‌63కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్‌మీ నార్జో ఎన్‌63 ధర, లభ్యత..

రియల్‌మీ నార్జో ఎన్‌63 లెదర్ బ్లూ, ట్విలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. లెదర్ బ్లూ వేరియంట్ వేగన్ లెదర్ ఫినిషింగ్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తోంది. 4జీబీ+64జీబీ వేరియంట్ రూ. 8,499కి అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది. అమెజాన్, రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూన్ 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 500 కూపన్‌ను కూడా పొందవచ్చు. దీని సాయంతో 64జీబీ, 128జీబీ వేరియంట్‌ల ధర రూ.7,999, రూ.8,499కి తగ్గుతుంది.

రియల్‌మీ నార్జో ఎన్‌63 స్పెసిఫికేషన్స్..

రియల్‌మీ నార్జో ఎన్‌63 ఫోన్లో మాలి జీ57 జీపీయూ, 4జీబీ ర్యామ్‌, 128జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, యూనిసోక్‌ టీ612 ఎస్‌ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 1,600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల హెచ్‌డీప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌, 90హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 180హెర్జ్‌ టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్టంగా 450 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఏఐ-బ్యాక్డ్ ప్రైమరీ రియర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫోన్ ఎయిర్ గెస్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌ సీ కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. అదనంగా, పరికరం దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం ఐపీ54 రేటింగ్‌ను పొందింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..