ప్రస్తుతం ఇప్పుడంతా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నడుస్తోంది. తాజాగా ఈ ఫ్లాట్‌ఫామ్‌లోకి మై హోం గ్రూప్ సంస్థ అడుగు పెడుతోంది. నమ్మకమే పెట్టుబడిగా.. జన అభిమానాన్ని చూరగొన్న మై హోం గ్రూప్ మరో సంచలనానికి తెరతీసింది. మై హోం గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు మార్కెట్లో మొట్ట మొదటి ఓటీటీని లాంచ్ చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్.. మెగా ప్రొడ్యూసర్‌గా ఎంతో గుర్తింపు పొందారు. తాజాగా ఆయన మరో కొత్త బిజినెస్‌ని ప్రారంభించారు. ఆయన ఇప్పటికే డిజిటల్ రంగంలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇతర డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌కి గట్టి పోటీని ఇచ్చేలా.. అల్లు అరవింద్, మై హోం గ్రూప్ ‘ఆహా’ అనే యాప్‌ని తీసుకొచ్చారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థలు మార్కెట్‌లో ఎంత హవాను కొనసాగిస్తున్నాయో తెలుసు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5లు భారతీయ డిజిటల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి.
కాగా.. ఈ యాప్‌కి ప్రచార కర్తగా భారీ క్రేజ్ ఉన్న యువ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి హోర్డింగ్స్‌ని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు.