RakshaBandhan 2021: రక్షాబంధన్.. రాఖీ పండుగ.. ఎలాగైనా పిలవచ్చు కానీ, దాని అర్ధం మాత్రం తన సోదరుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సోదరి కట్టే రక్షా సంకేతం. రేపు ఆగస్టు 22 ఆదివారం రక్షాబంధన్ జరుపుకోబోతున్నాం. ఈ రాఖీకి మీ సోదరుడికి ఆరోగ్య మంత్రాన్ని రక్షగా కట్టండి. ఇప్పుడు అంతా స్మార్ట్ అయిపొయింది. మీరు కూడా స్మార్ట్ వే లో మీ సోదరునికి రక్ష అందించండి. ఎదనుకంటె.. ఇది కరోనా కాలం. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. మీ సోదరుని ఆరోగ్యం ఎప్పటికప్పుడు ఎలా ఉందొ తెలుసుకునేలా స్మార్ట్ బ్యాండ్ రాఖీగా అందించండి. అందుబాటు ధరల్లో ఉన్న కొన్ని స్మార్ట్ బ్యాండ్ లు.. వాటి ఫీచర్లను మీ కోసం అందిస్తున్నాము. వీటిలో మీకు అనుకూలమైనది ఎంచుకోండి.. రాఖీ పండగ మీ సోదరుని ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ప్రయత్నించండి.
రూ. 345 నుండి 599 మధ్య ధర ఉన్న ఆ తక్కువ బడ్జెట్ స్మార్ట్ బ్యాండ్ల గురించి ఇప్పుడు చూద్దాం..
1. M4 ఇంటెలిజెన్స్
M4 ఇంటెలిజెన్స్ బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లు, టాబ్లెట్‌లకు కనెక్ట్ చేస్తుంది. ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటు, రక్త ఆక్సిజన్‌ను కొలుస్తుంది. మీరు ఎంత నడవాలి.. ఎంత నిద్రపోతారో కూడా ఇది తెలియజేస్తుంది. మీరు కాల్స్,ఎస్ఎంఎస్ అదేవిధంగా.. వాట్సాప్ కు సంబంధించిన నోటిఫికేషన్‌లను కూడా చూడవచ్చు. దీని ఖరీదు.. 345 రూపాయలు.
2. రిగర్ M4
రిగర్ M4 బ్యాండ్ రంగురంగుల ఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్పీడోమీటర్ ఫీచర్, రక్తపోటు పర్యవేక్షణ వ్యవస్థ మీరు ఎంత నడుస్తున్నారో తెలుసుకోవడానికి పనిచేస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, SPO2 ని తనిఖీ చేస్తుంది. ఇది 350 రూపాయలకు దొరుకుతుంది.
3. నాచ్ M4 ప్లస్
ఈ స్పోర్ట్స్ వాచ్ షియోమి, ఒప్పో, వివో మొబైల్ ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. BP మానిటర్ కేలరీ కౌంటర్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. వాటర్‌ప్రూఫ్ / స్వేట్ ప్రూఫ్ స్మార్ట్ బ్రాస్లెట్- IP67 రేటింగ్ అందుబాటులో ఉంది. దీనిని వర్షంలో తీయవలసిన అవసరం లేదు. కానీ ఈత లేదా స్నానం చేసేటప్పుడు దీనిని ధరించకపోవడమే మంచిది. దీనిని మీరు 499 రూపాయల ధరలో కొనుగోలు చేయవచ్చు.
4. తోకాడిస్ స్మార్ట్ బ్యాండ్
స్మార్ట్ బ్యాండ్ ఆర్మీ బ్లూ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. 1.1-అంగుళాల కలర్ డిస్‌ప్లే, USB ఛార్జింగ్ అందుబాటులో ఉంది. యాప్ నోటిఫికేషన్‌లు, కాల్‌లు, హృదయ స్పందన రేటు, SPO2 పర్యవేక్షణ వ్యవస్థలను ఈ స్మార్ట్ బ్యాండ్ అందిస్తుంది. మూడు స్పోర్ట్ మోడ్‌లతో అందుబాటులో ఉన్న దీని ఖరీదు 599 రూపాయలు.
5. స్పై ID115
ఇది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్, ఎస్ఎంఎస్, వాట్సాప్ నోటిఫికేషన్‌లు చూపిస్తుంది. వాచ్ ఫైండ్ మై ఫోన్ ఫీచర్‌తో ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఇది 599 రూపాయల్లో అందుబాటులో ఉంది.