Rainy Season: వర్షాకాలంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఏసీ, ఫ్రీజ్‌లు, టీవీలు కాలిపోవచ్చు! ఈ జాగ్రత్తలు తీసుకోండి

|

Jun 16, 2024 | 3:17 PM

వర్షాకాలం ప్రారంభమైంది. చాలా సమయంలో ఈదురు గాలులు, మెరుపులతో వర్షాలు కురుస్తుంటాయి. అంతేకాదు పిడుగులు కూడా పడుతుంటాయి. తుపాను ప్రభావంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఈ సమయంలో అత్యంత ఆందోళనకరమైన విషయం మెరుపు. కొన్నిచోట్ల పిడుగుపాటుకు ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకోగా, మరికొన్ని చోట్ల ఏసీ, ఫ్రిజ్‌లు కాలిపోతుంటాయి..

Rainy Season: వర్షాకాలంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఏసీ, ఫ్రీజ్‌లు, టీవీలు కాలిపోవచ్చు! ఈ జాగ్రత్తలు తీసుకోండి
Tech Tips
Follow us on

వర్షాకాలం ప్రారంభమైంది. చాలా సమయంలో ఈదురు గాలులు, మెరుపులతో వర్షాలు కురుస్తుంటాయి. అంతేకాదు పిడుగులు కూడా పడుతుంటాయి. తుపాను ప్రభావంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఈ సమయంలో అత్యంత ఆందోళనకరమైన విషయం మెరుపు. కొన్నిచోట్ల పిడుగుపాటుకు ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకోగా, మరికొన్ని చోట్ల ఏసీ, ఫ్రిజ్‌లు కాలిపోతుంటాయి. అందుకే మెరుపులతో వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్‌ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి అనేక జాగ్రత్తలు అవసరమని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో చాలా మంది కరెంటు కనెక్షన్ విషయంలో అనేక నిబంధనలు పాటిస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఏసీలు, ఫ్రీజ్‌లు, టీవీలు కాలిపోయిన సంఘటనలున్నాయి. అందుకే ఈ పరిస్థితిలో ఏమి చేయాలో అటువంటి సమస్యలను సులభంగా నివారించవచ్చు.

ఆకాశంలో నల్లటి మేఘాలు కనిపిస్తే ఏం చేయాలి?

1. ముందుగా ఇంటి కిటికీలు, తలుపులు మూసేయండి. ముఖ్యంగా గ్లాస్ కిటికీలు, తలుపులు ఉన్నవారు కూడా త్వరగా మూసివేయాలి.

2. ఆకాశంలో మెరుస్తున్న సమయంలో ఇంట్లో ఉండే ఏసీ, ఫ్రీజ్‌, టీవీల విద్యుత్‌ కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేయడం ఉత్తమం. అధిక ఓల్టేజీ ఎలక్ట్రానిక్ వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. ఏసీ, ఫ్రిజ్, మైక్రోవేవ్, టీవీ మొదలైనవి.

3. కేవలం షట్ డౌన్ చేయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. దాన్ని అన్‌ప్లగ్ చేయాలి. ఏసీ, రిఫ్రిజిరేటర్‌ని అన్‌ప్లగ్ చేయండి. పిడుగుపాటు సమయంలో స్విచ్‌ను తాకకపోవడమే మంచిది.

4. ఈ సీజన్‌లో తుఫాను ఎప్పుడు వస్తుందనేది చెప్పలేము. అందుకే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నా.. ఆఫీసుకు వెళ్తున్నా విద్యుత్‌ డిస్‌కనెక్ట్‌ చేయడం మంచిది.

5. ఇలాంటి సమయంలో మీ ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి ఉంచకూడదు. ఉరుములు , మెరుపులతో ఫోన్‌ కూడా పేలిపోయే ప్రమాదం ఉంది.

6. ఇంటి ఎర్తింగ్‌పై శ్రద్ధ పెట్టాలి. ప్రతి ఇంటికి ఎర్తింగ్‌ ఉండలం చాలా ముఖ్యం. లేకుంటే సమస్య తలెత్తవచ్చు.

7. వర్షం కురుస్తున్న ఉరుములు, మెరుపులు వస్తుంటే ల్యాప్‌టాప్‌ ఛార్జ్‌ కూడా చేయకండి. అవసరం ఉంటే తప్ప ల్యాప్‌టాప్‌ను వాడకండి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ఆన్‌ ఉంటే వెంటనే షట్‌డౌన్‌ చేయండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి