Chandrayaan-3: ఇండియన్ స్పేస్ హిస్టరీలో సరికొత్త అధ్యాయం.. చంద్రయాన్-3 విజయంపై ప్రధాని మోదీ ట్వీట్..

|

Jul 14, 2023 | 4:12 PM

New Delhi, July 14: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. ట్విట్టర్ వేదికగా చంద్రయాన్ సక్సెస్‌పై స్పందించారు. ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇండియన్‌ స్పేస్‌ హిస్టరీలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ప్రతి భారతీయుడిని కాలర్ ఎగరేసుకునే చేస్తుందన్నారు.

Chandrayaan-3: ఇండియన్ స్పేస్ హిస్టరీలో సరికొత్త అధ్యాయం.. చంద్రయాన్-3 విజయంపై ప్రధాని మోదీ ట్వీట్..
PM Modi on Chandrayaan 3
Follow us on

New Delhi, July 14: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన.. ట్విట్టర్ వేదికగా చంద్రయాన్ సక్సెస్‌పై స్పందించారు. ఇస్త్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇండియన్‌ స్పేస్‌ హిస్టరీలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ప్రతి భారతీయుడిని కాలర్ ఎగరేసుకునే చేస్తుందన్నారు. ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ శ్రమకు, అంకిత భావానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇస్త్రో శాస్త్రవేత్తల అవిరళ కృషికి, ఆత్మవిశ్వాసానికి, ప్రతిభకు నమస్సులు అని ట్వీట్ చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

కాగా, చంద్రయాన్-3 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. ఎల్‌వీఎం రాకెట్ చంద్రయాన్-3 మాడ్యూల్‌ని విజయవంతంగా భూకక్ష్యలోకి చేర్చింది. 24 రోజుల పాటు భూకక్ష్యలో తిరగనుంది చంద్రయాన్-3. ఆ తరువాత చంద్రుని వైపు పయనిస్తుంది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది. 40 రోజుల పాటు సాగనున్న సుధీర్ఘ ప్రయాణం తరువాత చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండ్ కానుంది చంద్రయాన్-3. ఇక ఎల్‌వీఎం విజయవంతంపై ఇస్త్రోలో సంబరాలు అంబరాన్నంటాయి. త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని ఇస్త్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..