సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచార మార్పిడి రాపిడ్ వేగంతో దూసుకుపోతోంది. అయితే ఈ సమాచారమంతా నిజమైందేనా అంటే కచ్చితంగా అవువనని చెప్పలేని పరిస్థితి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. నెట్టింట వైరల్ అయ్యే వార్తల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి బాగా పెరుగుతోంది. యూజర్లను తప్పు దారి పట్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు యూజర్ల అబద్ధపు ప్రకటనలతో తప్పుదారి పట్టిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నెట్టింట వైరల్ అవుతోన్న వార్త ప్రకారం.. ‘బీఎస్‌ఎన్‌ల్ సిమ్ కార్డును ఉపయోగించే వారు వెంటనే కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి, లేదంటే ట్రాయ్ సిమ్ కార్డును బ్లాక్ చేస్తుంది. 24 గంటల్లో కేవైసీ చేసుకోవాలి’ అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ట్రాయ్ లోగోతో ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అంతేకాదు కేవైసీ చేసుకోవడానికి పలానా నెంబర్‌కు కాల్ చేయమని ఫేక్ వార్తలో ఉంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్లు గందరగోళానికి గురయ్యారు.
People have received notices from BSNL claiming:
▪️ Customer’s KYC has been suspended by @TRAI
▪️ Sim cards will get blocked within 24 hrs#PIBFactCheck
✔️These Claims are #Fake
✔️BSNL never sends any such notices
✔️Never share your personal & bank details with anyone pic.twitter.com/yx376C0ndE
— PIB Fact Check (@PIBFactCheck) December 26, 2022
అయితే ఇదే విషయమై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఇలాంటి నోటీసులను ఎప్పుడూ ఇవ్వదని, ఎవరికీ మీ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను ఇవ్వకూడదని అలర్ట్ చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..