OPPO A58x 5G: రూ.15 వేలకే 5G స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు మీ కోసం..

|

Dec 14, 2022 | 8:40 AM

మన ఊహకు కూడా అందనంత వేగంగా టెక్నాలజీతో మానవుడు మమేకం అయిపోతున్నాడు. కొత్తగా వచ్చిన ప్రతి ఫీచర్‌ను తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఎవరైనా అంతే కదా..

OPPO A58x 5G: రూ.15 వేలకే 5G స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు మీ కోసం..
Oppo A58x 5g
Follow us on

మన ఊహకు కూడా అందనంత వేగంగా టెక్నాలజీతో మానవుడు మమేకం అయిపోతున్నాడు. కొత్తగా వచ్చిన ప్రతి ఫీచర్‌ను తన సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఎవరైనా అంతే కదా.. కొత్త కొత్త ఫీచర్లు ఉన్న మొబైల్ అందుబాటులో ఉందంటే దానిని కొనేందుకు కనీస ప్రయత్నం చేస్తుంటాం. ఏదైనా కొనే ముందు దాని ఫీచర్‌ల గురించి తప్పక తెలుసుకోవాలి. లేకపోతే కొన్నదానితో మనం సంతృప్తి చెందలేం. అలాంటి వారి కోసమే తాజాగా ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దాని వివరాలపై ఓ లుక్ వేద్దాం.

స్మార్ట్‌ఫోన్ తయారి సంస్థ OPPO తన కొత్త మోడల్ ‘OPPO A58x 5G’ను చైనాలో ఈ ఏడాది నవంబర్ నెలలో విడుదల చేసింది. 5G టెక్నాలజీకి అనుగుణంగా OPPO కంపెనీ తన కొత్త హ్యాండ్‌సెట్ OPPO A58x 5Gను విడుదల చేసింది. ఈ మోడల్‌లోని ముఖ్యమైన ఫీచర్ల గురించి చెప్పుకోవాలంటే.. పెద్ద స్క్రీన్, ఎక్కువ సమయం నిలిచే బ్యాటరీ, మంచి ప్రాసెసర్ వంటివి అనేకం ఉన్నాయి. OPPO A58x 5G ధర, ఫీచర్ల గురించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

OPPO A58x 5G స్పెసిఫికేషన్స్ 

  • డిస్ప్లే: OPPO A58x 5G స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉండడమేకాక HD ప్లస్ 720 x 1612 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇంకా 90 Hz రిఫ్రెష్ రేట్, 269 పిక్సెల్స్ పర్ ఇంచ్ పిక్సెల్ డెన్సిటీతో ఉంటుంది.
  • సాఫ్ట్‌వేర్: ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ColorOS 12.1 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంది.
  • ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్: OPPO A58x 5Gలో స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం MediaTek డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ఉంది. ఇంకా దీని ర్యామ్ 8 GB, 128 GB (UFS2.2) స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది.
  • బ్యాటరీ కెపాసిటీ: 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ డివైస్‌కి 5000 mAh బ్యాటరీ ఉంది.
  • కెమెరా సెటప్: ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. LED ఫ్లాష్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్,  2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
  • కనెక్టివిటీ: OPPOA58x 5G మొబైల్‌లో Bluetooth వెర్షన్ 5.3, Dual-SIM, USB టైప్-C పోర్ట్, Wi-Fi 802.11 AC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు  ఉన్నాయి. ఫోన్ కుడి వైపున ఉన్న పవర్ బటన్‌తోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇంటిగ్రేట్ అయి ఉంది.

OPPO A58x 5G ధర: 6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజీతో ఉన్నన ఈ మోడల్ ప్రస్తుతానికి ఇంకా భారత్‌లో లాంచ్ అవలేదు. అయితే చైనాలో దీని ధర 1200 చైనీస్ యువాన్ (సుమారు 14 వేల 206 రూపాయలు).

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం