Oneplus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ధర రూ. 20వేల లోపే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అంతే..

ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్. ఇప్పుడు మార్కెట్లోకి చవకైన ఫోన్లను లాంచ్ చేస్తోంది. రూ. 20,000లోపు ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ ని ఇటీవల లాంచ్ చేసింది. దాని పేరు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 5జీ. జూన్ 27 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభమైంది.

Oneplus Nord CE4 Lite 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త 5జీ ఫోన్.. ధర రూ. 20వేల లోపే.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అంతే..
Oneplus Nord Ce4 Lite 5g
Follow us

|

Updated on: Jun 27, 2024 | 5:21 PM

ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ప్రీమియం బ్రాండ్ వన్ ప్లస్. ఇప్పుడు మార్కెట్లోకి చవకైన ఫోన్లను లాంచ్ చేస్తోంది. రూ. 20,000లోపు ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ ని ఇటీవల లాంచ్ చేసింది. దాని పేరు వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 5జీ. జూన్ 27 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో టాప్ క్లాస్ ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంచ్ చేసింది వన్ ప్లస్. ఈ కొత్ ఫోన్లో అంతకు ముందు మోడల్ నోర్డ్ సీఈ3 లైట్ తో పోల్చితే అన్ని విభాగాల్లో అప్ గ్రేడ్లు కనిపిస్తాయి. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ సూపర్..

వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 ఫోన్లో 5,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అది కూడా 80వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జంగ్ సపోర్టు ఉంటుంది. వాస్తవానికి ఇప్పటి వరకూ వన్ ప్లస్ 12 మోడల్లోనే 5,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దానిని మించిన రీతిలో ఇప్పుడు ఈ ఫోన్ లో బ్యాటరీని ఇచ్చారు. బ్యాటరీ 20.1 గంటల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ లేదా 47.62 గంటల వీడియో కాల్‌లను ఒకే ఛార్జ్‌పై అందించగలగుతుంది. మొత్తం మీద ఒకే ఛార్జ్‌పై 1.5 నుంచి 2 రోజుల బ్యాటరీ జీవితాన్ని సులభంగా అందిస్తుంది. రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది

బెస్ట్ డిస్ ప్లే..

ఇంతకు ముందు మోడల్ నోర్డ్ సీఈ3 లైట్ ఎల్సీడీ డిస్ ప్లే ను కలిగి ఉండగా.. ఇప్పుడు లాంచ్ అయిన వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తుంది. హై-బ్రైట్‌నెస్ మోడ్‌లో 1,200నిట్స్ ను అందిస్తుంది. ఓఎల్ఈడీ ప్యానెల్ ఫోన్ అద్భుతమైన రంగులను చూపుతుంది. సోషల్ మీడియా ద్వారా అనంతంగా స్క్రోలింగ్ చేసినా లేదా ఓటీటీలో మీకు ఇష్టమైన షోను వీక్షించినా మిమ్మల్ని ఇది నిరాశపర్చదు.

ఆక్వా టచ్ ఫంక్షనాలిటీ..

ఈ ఫోన్లో ఆక్వా టచ్ ఫంక్షనాలిటీని అదనంగా జోడంచారు. డిస్ప్లే లేదా మీ తడి వేళ్లపై నీటి బిందువులను గుర్తించడానికి ఆక్వా టచ్ తెలివైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఇది తేమను గుర్తించిన తర్వాత, దానికి అనుగుణంగా టచ్ సెన్సిటివిటీని సర్దుబాటు చేస్తుంది. ఇది తెరవెనుక, మిల్లీసెకన్ల వ్యవధిలో జరుగుతుంది. ఫలితం? మీ వేళ్లు తడిగా ఉన్నప్పుడు లేదా స్క్రీన్‌పై చుక్కలు ఉన్నప్పుడు కూడా 95 శాతం టచ్‌లతో పాటు స్వైప్‌లు సమర్థంగా పనిచేస్తాయి.

అదరగొట్టే కెమెరా సిస్టమ్..

ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రైమరీ కెమెరాగా 50ఎంసీ సోనీ సెన్సార్‌ ఉంటుంది. ఇది తక్కువ వెలుతురులో కూడా సమర్థంగా ఫోటోలు, వీడియోలు తీయగలదు.

సమర్థవంతమైన పనితీరు..

వన్ ప్లస్ కొత్త ఫోన్ 8జీబీ ర్యామ్,128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 14 సాఫ్ట్‌వేర్‌తో జత చేసి ఉంటుంది. ఇది మృదువైన, వేగవంతమైన పనితీరును అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వన్ ప్లస్ తమ సొంత ర్యామ్ విటా, రోమ్ విటా టెక్నాలజీ సహాయంతో ఇది సాధ్యమవుతుంది. ఈ ఫోన్ ఏకకాలంలో 26 అప్లికేషన్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివ్‌గా ఉంచుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles