OnePlus Nord2: రెండు రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2) స్మార్ట్‌ఫోన్‌లో పేలుడు సంభవించడంతో ఓ యువకుడి తొడ బాగా దెబ్బతిన్నది. సుహిత్ శర్మ అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఫోటోను షేర్ చేయడం ద్వారా దీనిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోల్లో డ్యామేజ్ అయిన ఫోన్ ఉన్న పాదాల ఫోటో కూడా ఉంది. ఈ విషయం మీడియాలో వెలుగుచూడడంతో, కంపెనీ విచారణ ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ వినియోగదారుడి చికిత్స ఖర్చు మరియు డబ్బును వాపసు చేస్తామని హామీ ఇచ్చింది.
మై స్మార్ట్ ప్రైస్ (MySmartPrice) సమాచారం ప్రకారం, కంపెనీ బాధితుడిని సంప్రదించింది. దర్యాప్తు కోసం ఫోన్‌ను పూణేలోని సేవా కేంద్రానికి పంపించింది. అంతే కాకుండా బాధితుడితో సంప్రదింపులు జరుపుతున్నామని, చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే ఫోన్ ఖరీదు పూర్తి వాపసు కూడా ఇవ్వడం జరుగుతుందని కంపెనీ చెప్పినట్టు మై స్మార్ట్ ప్రైస్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై కంపెనీ ఎలాంటి బహిరంగ ప్రకటనను విడుదల చేయలేదు.
ఫోన్ పేలుడు విషయం ఇదీ..
సోషల్ మీడియా యూజర్ సుహిత్ శర్మ సోషల్ మీడియాలో 4 ఫోటోలను షేర్ చేశారు. వన్‌ప్లస్ నుంచి దీన్ని ఊహించలేదని ఆయన రాశారు. మీ ఉత్పత్తి ఏమి చేసిందో చూడండి. దయచేసి ఫలితం కోసం సిద్ధంగా ఉండండి. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మానేయండి. ఈ అబ్బాయి నీ వల్ల బాధ పడుతున్నాడు… వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదించండి. అని కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పేలుడు ఎంత భయంకరంగా జరిగిందో ఫోటో చూస్తుంటే తెలిసింది. ఇందులో యూజర్ జీన్స్ కాలిపోయింది. అలాగే, అతని తొడ భాగంలో బాగా కాలిపోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఇలాంటి సంఘటనలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని వన్ ప్లస్ (OnePlus) తెలిపింది. కంపెనీకి చెందిన బృందం వినియోగదారుని వద్దకు చేరుకుంది. ఈ విషయంపై విచారణ జరిపింది.
OnePlus Nord 2 ఇంతకు ముందు రెండుసార్లు ఇలానే..
ఫోన్ పేలుడు మొదటి కేసు: ఆగస్ట్ 1, 2021న, సోషల్ మీడియా వినియోగదారు అంకుర్ శర్మ తన భార్య కేవలం 5 రోజుల క్రితమే కొన్న OnePlus Nord 2 సైకిల్ తొక్కుతుండగా పేలిపోయిందని చెప్పారు. సైకిల్ తొక్కుతుండగా స్లింగ్ బ్యాగ్ లో ఫోన్ పెట్టుకుందామె. ఈ ఫోన్‌లో పేలుడు జరిగిన తర్వాత ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫోన్ వెనుక ప్యానెల్ పూర్తిగా దెబ్బతింది.
ఫోన్ పేలుడు యొక్క రెండవ కేసు: సెప్టెంబర్ 8, 2021 న, ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌరవ్ గులాటీ స్మార్ట్‌ఫోన్ పేలుడుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెప్టెంబరు 8న అతను తన కార్యాలయంలో (కోర్ట్ ఛాంబర్) కూర్చున్నప్పుడు, తన గౌను జేబులో వేడిని అనుభవించినట్లు చెప్పాడు. అతను తన జేబులో నుండి OnePlus Nord 2 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసినప్పుడు, దాని నుండి పొగ వస్తోంది. వెంటనే గౌను తీశాడు. ఆ తర్వాత ఫోన్ పేలింది.
OnePlus Nord 2 5G స్పెసిఫికేషన్‌లు:
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్‌ని సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో, ఆండ్రాయిడ్ 11తో, కంపెనీ ఆక్సిజన్ OS 11.3తో నడుస్తుంది. ఇది 6.43-అంగుళాల పూర్తి-HD + (1,080×2,400 పిక్సెల్‌లు) ప్లాయిడీ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200-AI ప్రాసెసర్‌తో ఫోన్‌లో 12GB RAM ఉంది. ఫోన్‌లో 256GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది.
ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం, ఇది 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 కెమెరా లెన్స్‌ను కలిగి ఉంది. ఇది ఫ్రంట్ ఫేసింగ్, EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మద్దతుతో వస్తుంది.
కనెక్టివిటీ కోసం, ఫోన్ 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS / NavIC, NFC, 5Gతో USB టైప్-సి పోర్ట్‌ను పొందుతుంది. ఇందులో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, సామీప్య సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 65W వార్ప్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
మొబైల్ బ్యాటరీ ఎందుకు పేలుతుంది?
OnePlus Nord 2 5G పేలిపోవడానికి కారణం వెల్లడి కాలేదు. అయితే, ముంబైకి చెందిన IT నిపుణుడు మంగళేష్ ఎలియా మాట్లాడుతూ ఛార్జింగ్ సమయంలో మొబైల్ చుట్టూ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ కూడా వేడెక్కుతుంది. అందువల్ల, ఛార్జింగ్‌లో మాట్లాడేటప్పుడు ఇది పేలవచ్చు. ఒక్కోసారి యూజర్ల తప్పిదాల వల్ల బ్యాటరీ ఓవర్ హీట్ అయి పేలిపోతుంది. ఫోన్‌లోని కెమికల్స్ మారి బ్యాటరీ పేలిపోవడం వల్ల బ్యాటరీ సెల్‌లు డెడ్ అవుతూ ఉంటాయి.
ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..