Food Deliveries: స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీనిస్తున్న ఓఎన్‌డీసీ.. తక్కువ ధరకే ఫుడ్‌ డెలివరీ ఎలాగంటే..?

| Edited By: Ram Naramaneni

Nov 02, 2023 | 9:52 PM

ఇటీవల కాలంలో ప్రముఖ పట్టణాల్లో ఓఎన్‌డీసీ ఫుడ్‌ డెలివరీ యాప్‌ కూడా ప్రజాదరణను పొందింది. ముఖ్యంగా ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ తక్కువ ధరలకే ఆహార పదార్థాలను అందించడంతో స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీగా నిలిచింది. అంతేకాకుండా ఓఎన్‌డీసీ ఇది సారూప్య సేవలను అందించే ప్రభుత్వ-మద్దతు ఉన్న ప్లాట్‌ఫామ్‌ కావడంతో అందరూ ఓఎన్‌డీసీను ఇష్టపడుతున్నారు.

Food Deliveries: స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీనిస్తున్న ఓఎన్‌డీసీ.. తక్కువ ధరకే ఫుడ్‌ డెలివరీ ఎలాగంటే..?
Food Delivery
Follow us on

ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ, జొమాటో వినియోగదారుల ఆదరణను పొందాయి. ముఖ్యంగా ప్రత్యేక వంటకాలు, రుచికరమైన వంటకాలను తమ ఇంటి వద్దకే కోరుకునే ఈ యాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రముఖ పట్టణాల్లో ఓఎన్‌డీసీ ఫుడ్‌ డెలివరీ యాప్‌ కూడా ప్రజాదరణను పొందింది. ముఖ్యంగా ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ తక్కువ ధరలకే ఆహార పదార్థాలను అందించడంతో స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీగా నిలిచింది. అంతేకాకుండా ఓఎన్‌డీసీ ఇది సారూప్య సేవలను అందించే ప్రభుత్వ-మద్దతు ఉన్న ప్లాట్‌ఫామ్‌ కావడంతో అందరూ ఓఎన్‌డీసీను ఇష్టపడుతున్నారు. అయితే ఓఎన్‌డీసీలో ఇంత తక్కువ ధరకు ఆహారానని ఎలా అందజేస్తున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

సాధారణంగా జొమాటో, స్విగ్గీ కంటే ఓఎన్‌డీసీ ఎందుకు అంత తక్కువకే ఫుడ్‌ను అందిస్తుందనే విషయంపై నిపుణులు ఇటీవల కొన్ని విషయాలను వెల్లడించారు. జొమాటో, స్విగ్గీ తమ ఆర్డర్ విలువల్లో 55 శాతం వసూలు చేస్తాయి. అయితే ఓఎన్‌డీసీ మాత్రం ఆర్డర్‌లో చిన్న భాగాన్ని తీసుకుంటుంది. దీన్ని ట్రిపుల్ డి మోడల్ అని అంటారు. ఇది కేవలం డెలివరీ ఖర్చు మాత్రమే కాదు. డిస్కవరీ ఖర్చు కూడా అందులో ఉంటుంది. ఆహార డెలివరీపై విధించే ఛార్జీలు 12 శాతానికి మించి ఉన్నప్పుడు ఈ మోడల్‌ ఓఎన్‌డీసీ పాటించి తక్కువ ధరకే వినియోగదారులకు ఆహారాన్ని అందిస్తుంది. 

మామూలుగా ఆహార డెలివరీ కోసం చాలా మంది 12 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. దాని పైన మీ సగటు తగ్గింపు 14-15 శాతమని ఆయా కంపెనీలు పేర్కొంటాయి. డిస్కౌంట్స్‌ లేకపోతే కస్టమర్లు ఆర్డర్‌ చేయరనే ఉద్దేశంతో ఆయా కంపెనీలు మీ మార్జిన్‌లో 55 శాతం అగ్రిగేటర్‌ల ద్వారా తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ కాలం కొనసాగితే తుది కస్టమర్‌పై ప్రభావం చూపే డిస్కౌంట్‌లను పెట్టమని ఈ కంపెనీల ద్వారా రెస్టారెంట్లు ఒత్తిడి తెస్తున్నాయి. ముఖ్యంగా తగ్గింపు అనేది ఒక వ్యసనంగా మారింది. అది ఎప్పుడూ మంచి విషయం కాదు. మీరు డిస్కౌంట్ల చుట్టూ మొత్తం వ్యవస్థను రూపొందించినప్పుడల్లా చివరికి వినియోగదారుడే బాధితుడు అవుతాడు. కాబట్టి అధిక కమీషన్లు వసూలు చేయనందున ఓఎన్‌డీసీ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి