Noise Smartwatch: నాయిస్ నుంచి చవకైనా స్మార్ట్ వాచ్.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్..

|

May 31, 2023 | 6:00 PM

ఇటీవల నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 3 లాంచ్ చేసిన ఆ కంపెనీ.. ఇప్పుడు నాయిస్ కలర్ ఫిట్ క్వాడ్ కాల్ పేరిట మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీనిని ప్రారంభ ధర కింద రూ. 1500లోపే విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Noise Smartwatch: నాయిస్ నుంచి చవకైనా స్మార్ట్ వాచ్.. ఫీచర్లు మాత్రం టాప్ క్లాస్..
Noise Colorfit Quad Call
Follow us on

దేశంలో బాగా పాపులర్ అయిన స్మార్ట్ వాచ్ ల బ్రాండ్లలో నాయిస్ కూడా ఒకటి. బోట్, పీట్రాన్ వంటి కంపెనీలకు దీటుగా తన ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. నాయిస్ నుంచి స్మార్ట్ వాచ్ లతో పాటు వైర్ లెస్ ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. అయితే వాటికన్నా స్మార్ట్ వాచ్ లకు మాత్రం ఈ నాయిస్ బ్రాండ్ బాగా పాపులర్. దీని నుంచి వచ్చే ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో కంపెనీ సరికొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తోంది. ఇటీవల నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 3 లాంచ్ చేసిన ఆ కంపెనీ.. ఇప్పుడు నాయిస్ కలర్ ఫిట్ క్వాడ్ కాల్ పేరిట మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీనిని ప్రారంభ ధర కింద రూ. 1500లోపే విక్రయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు..

నాయిస్ లాంచ్ చేసిన ఈ కలర్ ఫిట్ క్వాడ్ కాల్ స్మార్ట్ వాచ్ లో 240 x 280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఉంటుంది. దీనిలో 1.81 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే ఉంటుంది.. డిస్‌ప్లే 550 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. అవుట్ డోర్లో ఉన్నప్పుడు సూర్యకాంతిలో కూడా డిస్ ప్లే స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.. అంతర్నిర్మిత వాచ్ ఫేస్‌లతో పాటు, ఇది క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లకు కూడా మద్దతునిస్తుంది.

ఫీచర్లు ఇవి..

నాయిస్ వాచ్‌లో నాయిస్ బజ్ కనెక్టివిటీ ఉంటుంది. దీని ద్వారా ఫీచర్లను వినియోగించుకోవచ్చు. ఫోన్ నుంచి ట్లూ టూత్ ఎనేబుల్ కాలింగ్ చేయవచ్చు. ఇది ఇటీవల వచ్చిన కాల్ లిస్ట్ ను కూడా చూపుతుంది. 10 కాంటాక్ట్ లవరకూ వాచ్ లోనే సేవ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ కోసం వాచ్ బ్లూటూత్ 5.2, అంతర్నిర్మిత మైక్ మరియు స్పీకర్‌ను ఉపయోగిస్తుంది. వినియోగదారులు కాల్‌లు చేయడానికి డయల్ ప్యాడ్‌ని ఉంటుంది. ఇది గూగుల్ అసిస్టెంట్, సిరికి కూడా మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

హెల్త్ ఫీచర్లు..

నాయిస్ కలర్ ఫిట్ క్వాడ్ కాల్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, SpO2 సెన్సార్‌తో సహా అన్ని ప్రధాన సెన్సార్‌లు ఉన్నాయి. వాచ్‌లో SpO2 ట్రాకింగ్, హార్ట్ రేట్ మోనటరింగ్, స్లీప్ మోనిటరింగ్, స్ట్రెస్ మెజర్మెంట్, బ్రీత్ ప్రాక్టీస్, ఫీమేయిల్ హెల్త్ సైకిల్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉంటాయి. దుమ్ము, ధూళితో పాటు నీటి నుంచి సంరక్షించే ఐపీ67 రేటింగ్ ఉంటుంది. అలాగే 100 స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి.

బ్యాటరీ సామర్థ్యం..

దీనిలో 260ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 7 రోజుల లైఫ్ ను అందిస్తుంది. అలాగే ఈ బ్యాటరీ కేవలం 2.5 గంటల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జింగ్ పూర్తవుతుందని కంపెనీ ప్రకటించింది.

ధర, లభ్యత..

నాయిస్ కలర్ ఫిట్ క్వాడ్ కాల్ ధర లాంచింగ్ ఆఫర్ కింద రూ. 1,499గా ఉంది. అయితే ఇది కేవలం పరిమిత కాలం ఆఫర్ మాత్రమే. అమెజాన్ ఈ-స్టోర్ లో ఇది అందుబాటులో ఉంది. ఈ వాచ్ జెట్ బ్లాక్, స్పేస్ బ్లూ, రోస్ పింక్, సిల్వర్, గ్రే, డీప్ వైన్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..