నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో యూజర్లను పెంచుకుంటూ పోతోంది మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక యాప్‌గా వాట్సాప్ ప్రసిద్ధి చెందింది. ఈ యాప్‌కు ఎంతటి క్రేజ్ ఉందంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేంత. ఇక యూజర్ల ప్రైవసీ పెద్ద పీట వేస్తూ గత కొన్ని రోజులుగా వరుసగా ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్.. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను తీసుకొచ్చింది. నిజానికి ఈ ఫీచర్ ఇప్పటికే వచ్చేసింది కూడా. మెసేజ్ యూవర్‌సెల్ఫ్ పేరుతో వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగమెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలకి వెళ్లాల్సిందే.
ఉదాహరణకు మీరు గూగుల్‌లో ఏదో బ్రౌజ్ చేస్తున్నారు. అందులో మీకు ఓ ఆసక్తికరమైన కథనం కనిపించింది. దానిని సేవ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు. సదరు లింక్‌ను మీకు తెలిసిన వారి వాట్సాప్ చాట్‌కు పంపించుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ఎదుటి వారికి ఇబ్బందిగా అనుపిస్తుండొచ్చు. అలా కాకుండా మీ నెంబర్‌కే మీరు మెసేజ్ పంపించుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది.? అచ్చంగా ఈ ఆలోచనతో వాట్సాప్ ఈ మెసేజ్ యూవర్‌సెల్ఫ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో తమ వాట్సాప్ అకౌంట్ నుంచి తమకే మెసేజ్‌లు పంపొచ్చు.
ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు రిమైండర్స్ ప్లాన్, షాపింగ్ లిస్ట్, నోట్స్ ప్రిపరేషన్ వంటి వాటి కోసం మరే ఇతర యాప్స్‌ను ఉపయోగించకుండా వాట్సాప్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్ది మంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని వాట్సాప్ తెలిపింది. ఇక మీ నెంబర్‌కు మెసేజ్ పంపాలంటే చాట్ బాక్స్ ఓపెన్ చేసి.. మీ నెంబర్‌ను సెర్చ్ చేయాలి. వెంటనే.. మీ ఫోన్ నెంబర్‌తో పాటు బ్రాకెట్‌లో యూ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు మీరు మెసేజ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..