Nike Adapt BB Smart Shoes: నైక్‌ నుంచి బ్లూటూత్‌ స్మార్ట్‌ షూ.. ఆటోమేటిక్‌గా లెస్‌లను కట్టేసుకుంటుంది!

Nike Adapt BB Smart Shoes: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు, స్మార్ట్‌గాడ్జెట్‌లకు, స్మార్ట్‌ వాచ్‌లకు బ్లూటూత్‌ సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు బ్లూటూత్‌సదుపాయంతో స్మార్ట్‌షూస్‌లు..

Nike Adapt BB Smart Shoes: నైక్‌ నుంచి బ్లూటూత్‌ స్మార్ట్‌ షూ.. ఆటోమేటిక్‌గా లెస్‌లను కట్టేసుకుంటుంది!

Updated on: May 10, 2022 | 8:29 AM

Nike Adapt BB Smart Shoes: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు, స్మార్ట్‌గాడ్జెట్‌లకు, స్మార్ట్‌ వాచ్‌లకు బ్లూటూత్‌ సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు బ్లూటూత్‌సదుపాయంతో స్మార్ట్‌షూస్‌లు కూడా వచ్చేశాయి. నైక్(nike) కంపెనీ నుంచి మీ కోసం ఒక స్మార్ట్ షూలను విడుదల చేసింది. ఈ నైక్ షూ స్మార్ట్ అండ్ పూర్తిగా ఆటోమేటిక్. ఈ బ్లూటూత్‌ షూ రోబోట్ లాగా లేస్‌ని కట్టివేస్తుంది. ఈ షూ పేరు అడాప్ట్‌ బిబి అని పేరు పెట్టింది కంపెనీ. లుక్స్‌ పరంగా చూస్తే బాస్కెట్‌బాల్‌ షూలా ఉంటుంది. ఇవి వేసుకున్న వెంటనే అటోమేటిక్‌గా లేస్‌లు కట్టుకోవడం దీని ప్రత్యేకత. ఇందులో ఇంకో ప్రత్యేక ఉంది. Nike Adapt BB బ్లడ్ ప్రేజర్ కూడా తెలియజేస్తుంది. మీరు ఈ షూలాను ధరించినప్పుడు మీ పాదాలు వాపు ఉన్నట్లయితే అందుకు అనుగుణంగా రక్త ప్రసరణ చేసేలా సహాయపడతాయి. అటోమేటిక్‌గా సర్దుబాటు అవుతాయి. పాదాలకు బిగుసుపోకుండా వదులుగా మారుతుంటాయి.

మీరు ఈ షూలను యాప్‌ ద్వారా కూడా కంట్రోల్‌ చేయవచ్చు. ఇంతకుముందు నైక్ బ్రాండ్ నైక్ + ఐపాడ్ అండ్ నైక్ + ట్రైనింగ్ వంటి స్మార్ట్ షూలను ప్రవేశపెట్టింది. భారతదేశంలో Nike Adapt BB విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే షూ ధరించే ముందు పాదాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేసుకునేలా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. పాదాలకు ఏదైనా నొప్పి ఉన్నా.. షూల ఎఫెక్ట్‌ లేకుండా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి