
WhatsApp Groups Update: వాట్సాప్.. ఇది ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిందే. ఇది లేనిది స్మార్ట్‌ఫోన్ అంటూ ఏదీ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ చాటింగ్, గ్రూప్ చాటింగ్, స్టేటస్‌లతో మునిగి తేలుతుంటారు. ఇక యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ సంస్థ కూడా అనేక ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక వాట్సాప్‌లో గ్రూపులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కొందరిని చేరుస్తూ గ్రూప్‌ను క్రియేట్ చేసుకుంటూ తమ తమ సందేశాలను పంచుకుంటున్నారు. ఇక వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులు ఎవరైనా మెసేజ్‌లు చేస్తే దానిని తొలగించాలంటూ పంపిన వారు తప్ప ఇంకెవ్వరు కూడా తొలగించే అనుమతి ఉండదు. దానిని డిలీట్ చేయాలంటూ పంపిన వారికి రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల కొరకు అదిరిపోయే ఫీచర్స్‌ను తీసుకువచ్చింది. ఇందు కోసం వాట్సాప్ కొత్త 2.22.1.1 అప్డేట్ను విడుదల చేసింది.
వాట్సాప్ గ్రూపులో అడ్మిన్లుగా ఉన్న వారు గ్రూప్‌లో ఏ సందేశాన్నైనా తొలగించవచ్చు. వాట్సా్ప్ గ్రూపు నిర్వహిస్తున్న వారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రూపుల్లో రకరకాల మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ కొన్ని పనికి రాని మెసేజ్‌లు వస్తే వాటిని తొలగించాలంటూ పంపిన వారు మాత్రమే డిలీట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు డిలీట్ చేసే అనుమతి గ్రూప్ అడ్మిన్లకు కూడా ఉంటుంది. ఏదైనా మెసేజ్‌ను అత్యవసరంగా డిలీట్ చేయాల్సి వస్తే ఇప్పుడు గ్రూప్ అడ్మిన్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి: