Smartwatch for Plants Monitors Water: ఇప్పుడు మొక్కలు తమకు నీరు ఎప్పుడు అవసరమో చెబుతాయి.. ఎలాగంటే..!

|

May 08, 2022 | 11:29 AM

Smartwatch for Plants Monitors Water: మొక్కలకు రోజు వారీగా నీరు పోస్తేనే పెరుగుతాయి. లేకపోతే చనిపోతాయి. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి మొక్కలకు నీరు ఎక్కువగా కావాల్సి ..

Smartwatch for Plants Monitors Water: ఇప్పుడు మొక్కలు తమకు నీరు ఎప్పుడు అవసరమో చెబుతాయి.. ఎలాగంటే..!
Follow us on

Smartwatch for Plants Monitors Water: మొక్కలకు రోజు వారీగా నీరు పోస్తేనే పెరుగుతాయి. లేకపోతే చనిపోతాయి. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి మొక్కలకు నీరు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఇక టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో చేసే పనులు కూడా సులభతరం అయిపోతున్నాయి. మొక్కలకు నీరు ఎప్పుడు అవసరం అనేది అర్థం చేసుకోవడం కొంత కష్టమే. కానీ ఇప్పుడు నీరు ఏ సమయంలో అవసరమనే విషయాన్ని మొక్కలు ఇట్టే చెప్పేస్తాయి. ఏంటి మొక్కలు చెప్పడం ఏంటనేగా మీ అనుమానం. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొక్కలకు నీరు ఏ సమయంలో కావాలనే విషయం తెలుసుకునే పరికరం వచ్చేసింది. శాస్త్రవేత్తలు మొక్కల కోసం ఒక ప్రత్యేకమైన స్మార్ట్ వాచ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఆకులకు నీరు ఏయే సమయాల్లో కావాలనే విషయాన్ని పరికరం తెలియజేస్తుంది. మొక్కలో నీటి కొరత లేకుండా ఉండేలా చెట్టును సంరక్షిస్తున్న తోటమాలి లేదా యజమానికి స్మార్ట్‌వాచ్ తెలియజేస్తుంది. బ్రెజిల్‌లోని బ్రెజిలియన్ నానోటెక్నాలజీ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు.

DailyMail నివేదిక ప్రకారం.. స్మార్ట్‌వాచ్‌లు మానవ హృదయం ఎలా కొట్టుకుంటుందో అలాగే కొత్త స్మార్ట్‌వాచ్ మొక్కలలో నీటి మట్టం ఎంత ఉందో గుర్తిస్తుంది. అంతర్గతంగా ఎంత తేమ అవసరం? అనేది ఈ స్మార్ట్‌ వాచ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన నమూనాను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. మొక్కలోని నీటి స్థాయిని గుర్తించేందుకు ఆకులకు సెన్సార్‌ని అమర్చారు. ఈ సెన్సార్ దానిలోని తేమ స్థాయిని తనిఖీ చేస్తుంది. ఈ సెన్సార్‌కి యాప్ లింక్ చేయబడింది. ఈ యాప్ యూజర్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయబడింది. ఈ సెన్సార్ నీటి కొరతను గుర్తించినప్పుడల్లా, ఆ సమాచారాన్ని వినియోగదారు యాప్‌కు అందిస్తుంది. ఆ తర్వాత మొక్కలకు నీళ్లు పోయవచ్చు. ఇదంతా వైర్‌లెస్‌గా జరుగుతుంది.

ఇంతకుముందు కూడా ఇటువంటి సెన్సార్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఎలక్ట్రోడ్ ఆకులపై సరిగ్గా పని చేయకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఫలితంగా దాని ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. అందుకే బ్రెజిలియన్ నేషనల్ లాబొరేటరీ ఆఫ్ నానోటెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఆకులకు అతికించి సుదీర్ఘకాలం పాటు పర్యవేక్షించగలిగే ఎలక్ట్రోడ్‌లను రూపొందించారు. దీని కోసం శాస్త్రవేత్తలు రెండు రకాల ఎలక్ట్రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటిలో ఒకటి నికెల్‌తో తయారు చేయబడింది. మరొకటి కాలిన కాగితంపై మైనపు పొరను పూయడం ద్వారా తయారు చేయబడుతుంది. ప్రయోగం సమయంలో రెండు ఎలక్ట్రోడ్లు టేప్ సహాయంతో సోయాబీన్ విరిగిన ఆకుకు జోడించబడ్డాయి. ఇలా చేసిన తర్వాత శాస్త్రవేత్తలకు ఆకు ఎండబెట్టడంపై మంచి సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ప్రయోగం తర్వాత ఎలక్ట్రోడ్ ఆకులకు జోడించబడేలా పరికరంగా మార్చబడింది. ప్లాంట్‌లో ఎంత నీరు ఉందనే విషయాన్ని పర్సంటేజీ రూపంలో చూస్తారు. ఈ సమాచారంతో మొక్కలు పురుగుమందుతో ఏ మేరకు పోరాడుతున్నాయి, అందులో ఎన్ని విషపూరిత అంశాలు ఉన్నాయో కూడా తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి