Pegasus: లేటెస్ట్ యాప్.. పెగాసెస్ గుట్టు విప్పేస్తుంది.. ఇలా ట్రై చేయండి

|

Aug 05, 2021 | 1:43 PM

పెగాసస్ స్పైవేర్ ప్రకంపనలు ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్త్పైవేర్ వల్ల పలు దేశాల్లో అస్థిర పరిస్థితులు

Pegasus: లేటెస్ట్ యాప్.. పెగాసెస్ గుట్టు విప్పేస్తుంది.. ఇలా ట్రై చేయండి
Follow us on

పెగాసస్ స్పైవేర్ ప్రకంపనలు ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ స్త్పైవేర్ వల్ల పలు దేశాల్లో అస్థిర పరిస్థితులు ఏర్పడి రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడకపోయిన ప్రతిపక్షాలు మాత్రం పట్టువీడడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. అంతటి సంచలనం సృష్టించిన ఇజ్రాయిల్ ఎన్ఎస్‌వో సృష్టించిన ఈ స్త్పైవేర్‌ బారిన పడ్డారు చాలా మంది ప్రముఖులు.

మనకు తెలియకుండానే మన డేటా చోరీ..

మనకు తెలియకుండానే ఈ స్త్పైవేర్‌ మన ఫోన్లలోని డేటాను చోరీ చేస్తోంది. దీన్ని గుర్తించేందుకు, మన ఫోన్లపై నిఘా ఉంచిందా లేదా అన్నది కొన్ని యాప్స్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు. IMazing అనే ఈ యాప్ మ్యాక్ ఓఎస్, విండోస్ రెండింటికీ పనిచేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించిన ఐఫోన్ ద్వారా మ్యాక్ ఓఎస్, విండోస్‌కు కనెక్ట్ కావడం ద్వారా మన ఫోన్ స్త్పైవేర్‌ బారినపడిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఐఫోన్‌లో స్త్పైవేర్ గుర్తించేందుకు మ్యాక్ ఓఎస్, విండోస్‌లలో iMazing 2.14 వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. ఐఫోన్‌ను మ్యాక్ ఓఎస్, విండోస్‌‌కు కనెక్ట్ చేసి డిటెక్ట్ స్ల్పై‌వేర్ ఆప్షన్‌ను ఎంపిక చేయడం ద్వారా మనం ఫోన్‌పై నిఘా ఉందా, లేదా అన్న విషయనాన్ని తెలుసుకోవచ్చు.  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవ హక్కుల సంఘం ఇది వరకే మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్‌ను విడుదల చేసినా ఫ్రెండ్లీ యూస్ కోసం ఈ కొత్త యాప్‌ను విడుదల చేశారు.