Google: గూగుల్‌లో వీటి గురించి వెతుకుతున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్రత్త..

|

Jun 25, 2024 | 2:38 PM

అంతలా గూగుల్‌ జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంది కదా అని గూగుల్‌లో ఏది పడితే అది సెర్చ్‌ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే దానిని నేరంగా పరగణించే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్‌లో సెర్చ్‌ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుుకుందాం..

Google: గూగుల్‌లో వీటి గురించి వెతుకుతున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్రత్త..
Google Search
Follow us on

గూగుల్‌.. ఈ పేరు తెలియని వారు ఉండనరడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గూగుల్‌ సెర్చ్‌లో వెతికే రోజులు వచ్చేశాయ్‌. ప్రతీ సమస్యకు గూగుల్‌లో కచ్చితంగా పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్మకంతో ఉంటారు. అందుకే తెలిసిన సమాచారాన్ని కూడా ఓసారి గూగుల్‌లో సెర్చ్‌ చేసి కాన్ఫామ్‌ చేసుకుంటుంటారు.

అంతలా గూగుల్‌ జీవితంలో ఓ భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్‌ ఉంది కదా అని గూగుల్‌లో ఏది పడితే అది సెర్చ్‌ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే దానిని నేరంగా పరగణించే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్‌లో సెర్చ్‌ చేయకూడని ఆ అంశాలు ఏంటో ఇప్పుడు తెలుుకుందాం..

* దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతోన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చిన్నారుల విషయంలో వ్యవహరిస్తోంది. గూగుల్ సెర్చ్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సెర్చ్‌ చేయడం లేదా షేర్‌ చేయడం లాంటివి చేస్తే చట్ట విరుద్ధం. దీంతో మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

* ఇక గూగుల్‌ వెతకకూడని మరో అంశం. బాంబును ఎలా తయారు చేస్తారు. నిజానికి కొందరు తమకు అవసరం లేని అంశమైనా సరదా కోసమైనా ఇలాంటివి సెర్చ్‌ చేస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదు. నిఘా వర్గాలు ఇలాంటి వారి కోసం సెర్చ్‌ చేసే వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయనే విషయాన్ని మర్చిపోకూడదు.

* భారతదేశంలో అబార్షన్‌కు సంబంధించి కొన్ని నిర్ధిష్ట చట్టాలు ఉన్నాయి. నిర్ణీత సమయం తర్వాత డాక్టర్‌ను సంప్రదించకుండా గర్భస్రావం చేసుకోవడం అనేది భారత చట్టాల ప్రకారం నేరం. కాబట్టి గూగుల్‌లో అబార్షన్స్‌కు సంబంధించి ఎలాంటి సెర్చ్‌ చేసినా నేరంగా పరిగణిస్తారు.

* గూగుల్‌ సెర్చ్‌ చేయడమే కాదు కొన్ని రకాల కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల ప్రైవేట్‌ వీడియోలను లేదా ఫొటోలను గూగుల్‌లో షేర్‌ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఇక అత్యాచార బాధితురాలి పేరు లేదా ఆమెకు సంబంధించిన వివరాలను సెర్చ్‌ చేయడం కూడా నేరంగా భావిస్తారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..