National Train Enquiry System: మీరు ప్రయాణిస్తున్న రైలు ఎక్కడుందో తెలుసుకోవాలనుందా..? ఇలా చేయండి

National Train Enquiry System: ప్రస్తుతం రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ వెల్లడిస్తోంది రైల్వే వ్యవస్థ. అయితే రైలు టికెట్ బుక్‌ చేసుకున్న తర్వాత మీరు..

National Train Enquiry System: మీరు ప్రయాణిస్తున్న రైలు ఎక్కడుందో తెలుసుకోవాలనుందా..? ఇలా చేయండి

Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2021 | 7:27 AM

National Train Enquiry System: ప్రస్తుతం రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ వెల్లడిస్తోంది రైల్వే వ్యవస్థ. అయితే రైలు టికెట్ బుక్‌ చేసుకున్న తర్వాత మీరు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. రైల్వేకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ ఎంక్వైరీ NTES https://enquiry.indianrail.gov.in/ ఓపెన్‌ చేసి మీ రైలు స్టేటస్‌ను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఐఆర్సీటీసీ వెబ్‌ సైట్‌లో కూడా రైలు స్టేటస్‌ వివరాలు తెలుసుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్, రిజర్వేషన్ కౌంటర్‌లో కూడా రైలు నెంబర్‌ చెప్పి రైలు స్టేటషన్‌ తెలుసుకోవచ్చు.

అలాగే ఇవే కాకుండానే ప్రైవేటు సంస్థలు కూడా ట్రైన్‌ స్టేటస్‌ తెలిపే సేవలను అందిస్తున్నాయి. మీ వాట్సాప్‌లో కూడా మీ పీఎన్‌ఆర్‌ నెంబర్‌ ఎంటర్ చేసి మీ రిజర్వేషన్‌తో ట్రైన్‌ రన్నింగ్‌ స్టేటస్‌ కూడా తెలుసుకోవడం సులభం. రైలు టికెట్‌ బుక్‌ చేసే సమయంలో మీ ఫోన్‌ నెంబర్‌ తప్పనిసరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఫోన్‌ నెంబర్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌లో నమోదు అవుతుంది. మీరు ప్రయాణించబోయే రైలుకు చెందిన వివరాలు ఇదే ఫోన్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయి. దీంతో పాటే మీ టికెట్‌ రిజర్వేషన్‌ స్టేటస్‌తో పాటు ఆ రైలు వేళల్లో ఏవైనా మార్పులు ఉన్నా ఎస్‌ఎంఎస్‌ ద్వారా మీకు వెంటనే సమాచారం అందుతుంది. అందుకే ఈ వివరాలు తెలుసుకునేందుకు రైలు టికెట్‌ బుక్‌ చేసే సమయంలో తప్పనిసరిగా ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలి.

మీరు కౌంటర్‌లో టికెట్‌ తీసుకున్నా.. ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌లో టికెట్‌ బుక్‌ చేసినా మీ ఫోన్‌ నెంబర్‌ ఇవ్వడం మర్చిపోవద్దు. ఒక వేళ నెంబర్‌ ఇవ్వకపోతే ట్రైన్‌ సమయాల్లో ఏవైనా మార్పులు ఉంటే తెలుసుకునే అవకాశం ఉండదు. టికెట్‌ బుకింగ్‌ సమయంలో మీ దగ్గర ఉండే ఫోన్‌ నెంబర్‌ మాత్రమే ఇవ్వాలి.

అలాగే where is my train, indian railway train status అనే మొబైల్‌ యాప్ ద్వారా మీరు ఎక్కే రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మీరు రైలు ఎక్కిన తర్వాత ఈ యాప్‌ ద్వారా మీరు ఎక్కడున్నారు..? ఏఏ స్టేషన్లు వస్తున్నాయి..? అనే అనేక వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే రైలు స్పీడ్‌ ఎంత ఉంది..? వంటి వివరాలను సైతం తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.5 వేలు..!

PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్‌ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!