NASA: జాబిల్లి యాత్రలో మరో ముందడుగు.. కాంతికన్నా ఎక్కువ వేగంతో నేలపైకి సేఫ్‌ ల్యాండ్‌!

|

Dec 12, 2022 | 9:50 AM

జాబిల్లి యాత్రలో మరో ముందడుగు పడింది. ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ.. తిరిగి భూమ్మీదకు సేఫ్ గా చేరింది ఓరియన్ క్యాప్సుల్. నాసా చేసిన ఈ ప్రయోగం పూర్తి వివరాలేంటి? భవిష్యత్ లో దీని ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం..

NASA: జాబిల్లి యాత్రలో మరో ముందడుగు.. కాంతికన్నా ఎక్కువ వేగంతో నేలపైకి సేఫ్‌ ల్యాండ్‌!
NASA’s Orion capsule
Follow us on

జాబిల్లి యాత్రలో మరో ముందడుగు పడింది. ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ.. తిరిగి భూమ్మీదకు సేఫ్ గా చేరింది ఓరియన్ క్యాప్సుల్. నాసా చేసిన ఈ ప్రయోగం పూర్తి వివరాలేంటి? భవిష్యత్ లో దీని ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం..

నాసా.. జాబిల్లి యాత్రలో చివరి దశ విజయవంతంగా ముగిసింది. కాంతికన్నా ఎక్కువ వేగంతో నింగి నుంచి నేలకు సేఫ్‌గా ఒరియన్ క్యాప్సుల్ ల్యాండ్‌ అయ్యింది. 5 వేల డిగ్రీల ఉష్ణోగ్రతలు తట్టుకు నిలబడింది. ఓరియన్ కాలిఫోర్నియాకు పశ్చిమాన పసిఫిక్ మహా సముద్రంలో నిన్న ఉదయం 9. 40కి సేఫ్ గా ల్యాండయ్యింది. నవంబర్ 16న నింగిలోకి ఎగిసిన ఆర్టెమిస్.. 25 రోజుల పాటు.. 1. 4 మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణించి.. భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చింది..

గతంలో అపొలో- 17 ప్రాజెక్టులో చివరిసారిగా సిబ్బందితో కూడిన క్యాప్సుల్‌ భూమిని చేరుకొగా.. ఆ తర్వాత అంతకన్నా మించిన దూరం ప్రయాణించి.. గత రికార్డులను తిరగరాసిందీ మూన్ మిషన్. గతం వారం ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్లు శక్తిమంతమైన కదలికలతో దిశను మార్చాయి. దీంతో ఇది చంద్రుడి వైపు నుంచి భూమి వైపు కదలడం మొదలైంది. గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. భూ వాతావరణంలోకి ప్రవేశించింది. తర్వాత టాప్‌ స్పీడ్‌ను అందుకుంది.

ఇవి కూడా చదవండి

భూ వాతావరణంలోకి రాగానే ఒరియన్ చుట్టూ 5 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పుట్టుకొచ్చాయి. క్యాప్సుల్ చుట్టూ అమర్చిన ఉష్ణరక్షణ కవచాలను ఈ సమయంలో పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ హీట్ షీల్డ్ విజయవంతంగా పని చేస్తే భవిష్యత్ లో ఇది నమ్మకమైన స్పేస్ క్యాప్సుల్ గా అంచనాకు రావచ్చన్న ఆలోచన నాసా సైంటిస్టులది. స్పేస్ క్రాఫ్ట్ లోపలున్న వ్యోమగాముల రక్షణలో ఇదెంతో కీలకం. అందుకే ఇది పని చేయడం అవసరమన్నది ఆర్టెమిస్ మిషన్ ప్రతినిధులు చెప్పేమాట.

ఈ ప్రయోగం.. చంద్రుని అన్వేషణలో అత్యంత కీలకమైన ముందడుగుగా అభివర్ణిస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. సంవత్సరాల తరబడి వేలాది మంది కృషి.. ఈ మిషన్ సక్సెస్ లో దాగి ఉన్నాయనీ. ఈ ప్రయోగం.. వచ్చే రోజుల్లో మానవులు విశ్వ తీరాలకు చోరుకోడంలో కీలక పాత్ర పోషిస్తుందని.. అంచాన వేస్తున్నారు సైంటిస్టులు.

భూమి నుంచి 2, 70,000 మైళ్ల దూరం ప్రయాణం ఈ మిషన్ ద్వారా సాధ్యమైంది. ఇదెంత ఎక్కువ దూరమంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే వెయ్యి రెట్ల ఎక్కువ. ఇంత దూరం వ్యోమగాములు ప్రయాణిస్తే.. అక్కడెలాంటి స్థితిగతులు ఎదురవుతాయన్న ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకుని.. విజయవంతంగా తిరిగి భూమికి చేరింది ఓరియన్. చంద్రుని ఉపరితలం నుంచి 80 మైళ్ల దూరంలోకి వచ్చే రెండు మూన్ ఫ్లైబైలను ప్రదర్శించింది.

ఓరియన్ సురక్షితంగా భూమికి రిటర్న్ కావడంతో తమ తదుపరి మిషన్ పై నమ్మకాలు చిగురించాయనీ. ఇది చంద్ర గ్రహ పరిశోధనల్లోనే అత్యంత కీలక భాగంగా చెబుతున్నారు సైంటిస్టులు. ఇది మిషన్ మార్స్ తో పాటు, చంద్రుడిపై మానవ మనుగడ విషయంలో మరింత ముందుకెళ్లేలాంటి ప్రయోగానికి ఊతమిచ్చిందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.