Mars helicopter flight : అంగారక గ్రహంపై బుల్లి హెలికాప్టర్‌ నేడు ఎగరలేదు, వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎందుకంటే..

|

Apr 11, 2021 | 8:46 PM

NASA delays Mars helicopter flight : అరుణగ్రహం మీద బుల్లి హెలికాప్టర్‌ ఇవాళ ఎగరలేదు...

Mars helicopter flight : అంగారక గ్రహంపై బుల్లి హెలికాప్టర్‌ నేడు ఎగరలేదు, వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎందుకంటే..
Follow us on

NASA delays Mars helicopter flight : అరుణగ్రహం మీద బుల్లి హెలికాప్టర్‌ ఇవాళ ఎగరలేదు. ఇటీవల మార్స్​ ఉపరితలం మీదకు అడుగుపెట్టిన ఇన్​జెన్యూటీ హెలికాప్టర్​ను ప్రణాళిక ప్రకారం ఇవాళ ఎగిరేలా చేయాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భావించింది. అయితే, తాత్కాలికంగా ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నాసా ప్రకటించింది. సిస్టంలో ఏర్పడిన సాంకేతిక లోపాల కారణాలతో నిలిచిపోయినట్లు తెలిపింది. కాగా, శుక్రవారం తలపెట్టిన రోటర్ల హై-స్పీడ్ స్పిన్ పరీక్షలో ‘వాచ్​డాగ్’ టైమర్ కమాండ్ సీక్వెన్స్ ప్రారంభంలోనే ముగిసిందని తెలిపింది నాసా. దీంతో ప్రయోగాన్ని ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కాగా, అంగారకుడిపై జీవం పుట్టుకకు సంబంధించి నాసా 2020లో రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. అది ఫిబ్రవరి 18న అంగారకుడిపై ల్యాండ్‌ అయింది. ఆ రోవర్‌ నుంచి ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను నాసా ఇటీవల అంగారకుడి ఉపరితలంపై దింపింది. ఎలాంటి సాంకేతిక సాయం లేకుండానే హెలికాప్టర్‌ అక్కడి వాతావరణానికి తట్టుకోగలుగుతుందని నాసా ఇంతకుముందు తెలిపిన సంగతి తెలిసిందే.

Read also : Megha Gas : తెలంగాణలో ఇక చౌకగా ఇంటి.. వాహన గ్యాస్‌.! పంపిణీకి అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ‘మేఘా’ సంస్థ