
మోటరోలా తన కొత్త మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5న ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. లాంచ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటో G67 పవర్ కొన్ని స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. మోటరోలా నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ పరికరం సిలికాన్ కార్బన్ టెక్నాలజీని ఉపయోగించే 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది.
ఈ మధ్యలో ఫోన్ కొనాలానుకుంటున్న వారు.. ఈ ఫోన్ వచ్చేవరకు ఆగి, దానిపై ఒక లుక్కేసి అప్పుడు ఫోన్ కొంటే మంచిది. ఎందుకుంటే మంచి ధరలో ఇంత ఫీచర్లు ఉన్న ఫోన్, అది కూడా మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన మోడల్‌ను మిస్ అయ్యాం అనే బాధ లేకుండా ఉండాలంటే.. ఒక వారం పాటు ఆగి.. ఈ ఫోన్ చెక్ లిస్ట్‌లో దీన్ని కూడా చేర్చండి. నచ్చితే కొనండి. కాగా OPPO Find X9 Pro, OPPO Find X9 లతో పాటు OPPO ENCO X3s ఇయర్‌బడ్‌లు లాంచ్ అయ్యాయి. వాటిపై కూడా ఓ లుక్కేయండి.
Meet the all-new moto g67 POWER — built to keep you going longer and faster. With a segment-leading 7000mAh battery powered by Silicon Carbon tech, a 50MP Sony LYT-600 camera with 4K recording, and the Snapdragon 7s Gen 2 for blazing speed. Launching 5th November. pic.twitter.com/bMhW2LTnQ0
— Motorola India (@motorolaindia) October 29, 2025
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి