Motorola Frontier: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌.. 194 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు.

Motorola Frontier: ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరాలో ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొంగొత్త స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్ చేస్తోంది టెక్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా ఫ్రంటియర్‌..

Motorola Frontier: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌.. 194 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు.
Motorola

Updated on: Feb 20, 2022 | 2:34 PM

Motorola Frontier: ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం మోటోరాలో ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లు విడుదల చేస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన కొంగొత్త స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్ చేస్తోంది టెక్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా ఫ్రంటియర్‌ (Motorola Frontier) పేరుతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి మోటోరోలా అధికారికంగా ఎలాంటి ఫీచర్లు ప్రకటించకపోయినప్పటికీ, కొన్ని ఫీచర్లు లీకయ్యాయి. లీక్‌ అయిన సమాచారం మేరకు ఈ స్మార్ట్‌ ఫోన్‌లో రానున్న ఫీచర్లు ఇలా ఉన్నాయి..

  1. మోటోరోలా ఈ ఫోన్‌లో కెమెరాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఏకంగా 194 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 60 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.
  2. ఇక ఇందులో 144 హెట్ట్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.67 అంగుళాల ఫుల్‌ హెడ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
  3. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ చిప్‌సెట్‌తో కూడిన LPDDR5 12 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు.
  4. 50 వాట్ల వైర్‌లెస్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, 125 వాట్ల వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ ఈ ఫోన్‌ సొంతం. ఇక బ్యాటరీ విషయానికొస్తే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఇవ్వనున్నారు.
  5. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వైఫై 6ఈతో పాటు యూఎస్‌బీ టైప్‌-సీ, బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఇవ్వనున్నారు.
  6. ఆండ్రాయిడ్‌ 12 మైయూక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ రానుంది.
  7. ఇక అధునాత ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర, అధికారిక ప్రకటన 2022 జూలైలో రానున్నట్లు సమాచారం.

Also Read: East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..

Rajasthan Crime: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా తొమ్మిది మంది మృతి

Digital Voter ID Card: డిజిటల్‌ ఓటర్‌ ఐడి డౌన్‌లోడ్‌ ఇలా చేసుకోండి.. వీడియో