Mobile OTP: మొబైల్ వినియోగదారులకు త్వరలో ఓ శుభవార్త అందనుంది. సిమ్ కార్డు మార్చకుండానే కేవలం ఓటీపీ ద్వారా పోస్టుపెయిడ్ నుంచి ప్రీపెయిడ్‌కు , ప్రీపెయిడ్ నుంచి పోస్టుపెయిడ్‌కు రావచ్చని టెలికం శాఖ ఏడీజీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనను టెలికం శాఖకు భారతీయ సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం పంపిందని తెలిపారు. అయితే దీని విధివిధానాలను పరిశీలించాలని తిరిగి టెలికం ఆపరేటర్లకే టెలికం శాఖ సూచించింది. ప్రస్తుతం 90 శాతం మొబైల్ చందాదారులు ప్రీపెయిడ్ సేవలను ఉపయోగించుకుంటున్నారు.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలకు ఏప్రిల్ 9న మొబైల్ కస్టమర్లను ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్‌కు మార్చడానికి కేవైసీ ఉపయోగించకుండా అనుమతించాలని కోరింది.
దేశంలో 5జీ హైస్పీడ్ డాటా సేవల ప్రారంభానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని భారతీయ ఎయిర్‌టెల్ ప్రకటించింది. నెట్‌వర్క్ క్వాలిటీ పెంచేందుకు కర్ణాటక, మతిళనాడు రాష్ట్రాల్లో అదనపు స్పెక్ట్రమ్‌నూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
Gold Hallmarking: బంగారం హాల్‌మార్కింగ్ గడువు జూన్ 15 వరకు పెంపు.. హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి..?