ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. రకరకాల ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండంతో దాదాపు అన్ని కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తున్నట్లు వార్తలు షికార్లు చేశాయి. ఇందుకు సంబంధించి గతంలోనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజాగా ప్రముఖ టెక్ నిపుణులు వోజ్‌చౌక్సీ ట్విట్టర్ వేదికగా ఈ స్మార్ట్ వాచ్‌కు సంబంధించి ట్వీట్ చేశారు. దీంతో టెక్ ప్రపంచంలో మెటా స్మార్ట్ వాచ్‌కు సంబంధించి చర్చ మొదలైంది. అయితే మెటా ఈ స్మార్ట్ వాచ్‌కోసం ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. గూగుల్ వేయర్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు బదులుగా ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ వాచ్ పనిచేయనుందని సమాచారం. త్వరలోనే ఈ వాచ్‌కు సంబంధించి మెటా అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు సమచారం.
Leak: A new version of the @Meta smartwatch is in development, new details and photos below? pic.twitter.com/mlEgEQvWp5
— Kuba Wojciechowski ? (@Za_Raczke) January 31, 2023
ఇదిలా ఉంటే ఈ వాచ్‌కు సంబంధించి కొన్ని విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో లీకైన మెటా వాచ్ డిజైన్ ఒకే తరహాలో ఉంటుందని వోజ్‌చౌక్సీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఇక వాచ్ డిజన్ విషయానికొస్తే ఇందులో డివైజ్ ముందు, వెనుక భాగంలో కెమెరాను హైలైట్ చేశారు. మెటా స్మార్ట్‌వాచ్ క్వాల్‌కాం చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని చెబుతున్నారు. యాపిల్ వాచ్ స్మార్ట్‌వాచ్ సిరీస్‌ను పోలిన విధంగా మెటా వాచ్ ఫ్లాట్ డిస్‌ప్లే, ఎడ్జ్‌లతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ వాచ్ ధర సుమారు రూ. 45,000గా ఉండొచ్చని అంచనా.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.