విద్యుత్ బిల్లును ఆదా చేయడానికి మీటర్‌తో కొన్ని ఉపాయాలు వివరించే రీల్స్, వీడియోలను మీరు చూసి ఉంటారు. వీటిలో అత్యంత పురాతనమైన, సాధారణమైన పద్ధతి అయస్కాంతం. మీటర్‌లో అయస్కాంతం పెట్టడం వల్ల మీటర్ రీడింగ్ ఆగిపోయి కరెంటు బిల్లు తగ్గుతుందని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి ట్రిక్స్ చేయడం నిజంగానే కరెంటు బిల్లు తగ్గుతుందా? వాస్తవానికి విద్యుత్ మీటర్‌లో మాగ్నెట్‌ను అమర్చడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించాలనే వాదన అపోహ. ఈ పద్దతి చట్ట వ్యతిరేకం కూడా. ఈ విషయంలో నిజానిజాలు, దాని తీవ్రమైన పరిణామాలను తెలుసుకుందాం.
అయస్కాంతాన్ని పెట్టడం వల్ల మీటర్ ఎందుకు నెమ్మదించదు?
ఎలక్ట్రిక్ మీటర్ అనేది మీరు వినియోగించే విద్యుత్తును కొలిచే ఖచ్చితమైన పరికరం. పాత మీటర్లు అయస్కాంత జోక్యానికి లోనయ్యే అవకాశం ఉంది. కానీ ఆధునిక డిజిటల్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు అయస్కాంత జోక్యం నుండి సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ కూడిన మీటర్లు ఉండటం వల్ల ఆస్కాంతం ద్వారా మీటర్‌ను నెమ్మదించడం కుదరని పని.
బిల్లు తగ్గించాలన్న వాదన తప్పు:
అయస్కాంతాన్ని ఉపయోగించి విద్యుత్ మీటర్‌ను వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే, అది విద్యుత్ వినియోగాన్ని ప్రభావితం చేయదు. అంటే మీ విద్యుత్ బిల్లులో ఎలాంటి మార్పు ఉండదు. విద్యుదయస్కాంత క్షేత్రం విద్యుత్ మీటర్‌పై పనిచేస్తుంది. అలాగే అయస్కాంత క్షేత్రం అయస్కాంతంపై పనిచేస్తుంది. అయస్కాంత క్షేత్రం కంటే విద్యుదయస్కాంత క్షేత్రం బలంగా ఉంటుంది. అందుకే ఇది పని చేయదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
చట్టపరమైన చర్యలు, భారీ జరిమానాలు:
విద్యుత్ మీటర్‌ను ట్యాంపరింగ్ చేయడం తీవ్రమైన నేరం. ఇది విద్యుత్ చౌర్యంగా పరిగణిస్తారు. ఇది భారతీయ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. మీటర్‌లో అయస్కాంతాన్ని అమర్చి విద్యుత్‌ను దొంగిలించిన వ్యక్తి పట్టుబడితే అతనికి భారీ జరిమానా, జైలు కూడా ఉంటుంది. ఇలాంటి కేసులను గుర్తించేందుకు విద్యుత్ శాఖ వద్ద ప్రత్యేక ఉపకరణాలు, సాంకేతికత ఉన్నాయి. మీటర్ ట్యాంపరింగ్‌కు భారీ జరిమానా, 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
భద్రతా ప్రమాదాలు:
విద్యుత్ మీటర్‌ను ట్యాంపరింగ్ చేయడం వల్ల విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదం, ఇతర ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది కాకుండా, అధిక శక్తితో పనిచేసే అయస్కాంతాలను ఉపయోగించడం వల్ల మీ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం ఉంటుంది.
విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఈ విషయాలపై శ్రద్ధ వహించండి:
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి