Mother’s Day 2023: మదర్స్ డే రోజున అమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ ఫోన్స్‌పై ఓ లుక్కెయ్యండి.. సూపర్ ఆఫర్స్ మీ కోసమే..!

|

May 09, 2023 | 3:45 PM

ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్లల్లో సమ్మర్ సేల్ నడుస్తుంది. కాబట్టి ఓ మంచి ఫోన్‌ను ఆర్డర్ చేస్తే కరెక్ట్‌గా మదర్స్ డే సమయానికి మీ చేతికి వస్తుంది. ఈ సేల్‌లో తక్కువ ధరతో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ల గురుంచి ఓ సారి తెలుసుకుందాం.

Mother’s Day 2023: మదర్స్ డే రోజున అమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఈ ఫోన్స్‌పై ఓ లుక్కెయ్యండి.. సూపర్ ఆఫర్స్ మీ కోసమే..!
Smartphones
Follow us on

ఈ ఏడాది మదర్స్ డే మే 15న వచ్చింది. అంటే సరిగ్గా ఈ రోజుకు వారం రోజుల సమయం ఉంది. కాబట్టి మదర్స్ డే రోజు మీ అమ్మను సర్‌ప్రైజ్ చేయడానికి ఓ మంచి గిఫ్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం ఓ అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్‌తో మీ ముందుకు వచ్చాం. ప్రస్తుతం అన్ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్లల్లో సమ్మర్ సేల్ నడుస్తుంది. కాబట్టి ఓ మంచి ఫోన్‌ను ఆర్డర్ చేస్తే కరెక్ట్‌గా మదర్స్ డే సమయానికి మీ చేతికి వస్తుంది. ఈ సేల్‌లో తక్కువ ధరతో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ల గురుంచి ఓ సారి తెలుసుకుందాం.

పోకో ఎం4 ప్రో

పోకో ఎం4 ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో 38% తగ్గింపుతో రూ. 13,499 వద్ద అందుబాటులో ఉంది. ఇది 8 జీబీ+ 128 జీబీ వేరియంట్‌తో వస్తుంది. 6.43 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ, హీలియో G96 ప్రాసెసర్, ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది.

మోటోరోలా జీ 62

మోటోరోలా జీ 62 6 జీబీ+128 జీబీ స్టోరేజ్ కలిగిన వెర్షన్ ఫ్లిప్‌కార్ట్‌లో 29% తగ్గింపుతో వస్తుంది. అంటే ఈ ఫోన్ రూ.15,499కు అందుబాటులో ఉంది. 6.55 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5 జీ ప్రాసెసర్లు, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 23

సామ్‌సంగ్ ఎఫ్ 23 గెలాక్సీ ఎఫ్ 23 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15999కి అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ.23,999. ఈ ఫోన్ 6.6 ఫుల్ హెచ్‌డీ ప్లస్  డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో  50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

రియల్ మీ 10 ప్రో ప్లస్

రియల్ మీ 10 ప్రో ప్లస్ 5 జీ వివిధ శ్రేణుల్లో అందుబాటులో ఉంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 9% తగ్గింపుతో రూ. 18,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 5 జీ చిప్‌సెట్, 108 ఎంపీ ప్రో లైట్ కెమెరా, హైపర్‌స్పేస్ డిజైన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్

వన్ ప్లస్ నార్డ్ సీ 2 లైట్ 5 జీ ఫ్లిప్‌కార్ట్‌లో 6% తగ్గింపుతో రూ. 18,756 వద్ద అందుబాటులో ఉంది. వన్ ప్లస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 6 జీబీ + 128 జీబీ ర్యామ్‌తో 6.59 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 ఎంపీ బ్యాక్ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..